Site icon Prime9

Rashmika: అవి నన్ను బాధిస్తున్నాయి.. రష్మిక భావోద్వేగ నోట్

Rashmika Mandanna open up on online trolls

Rashmika Mandanna open up on online trolls

Rashmika: పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషన్ క్రష్ అయిన రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా తన కాలాన్ని గడుపుతుంది. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. అయితే తాజాగా ఈ అందాల భామ గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న రూమర్స్, ట్రోల్స్ గురించి తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నందుకు ఆవేదన వ్యక్తం చేసింది. తన హృదయాన్ని ఆ నెగిటివ్ రూమర్స్ ఎంతగానో గాయపరుస్తున్నాయని చెప్పుకొచ్చింది.

“గత కొద్ది నెలలుగా వస్తున్న కొన్ని విషయాలు నన్ను ఎంతగానో ఇబ్బందిపెడుతున్నాయి. ఇప్పుడు వాటికి సరైన సమాధానం చెప్పే సమయం వచ్చిందనుకుంటున్నాను. ఇప్పుడు నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నేను నా కెరీర్ స్టార్ చేసినప్పటి నుంచి ద్వేషానికి గురవుతున్నాను. చాలా ట్రోల్స్, నెగిటివిటి, నా గురించి మాట్లాడటం చాలా బాధిస్తుంది. నేను ఎంచుకున్న జీవితం చాలా కష్టతరమైనదని ప్రతి ఒక్కరు నన్ను ప్రేమిస్తారు అని నేను అనుకోను. ఇన్ని రోజులుగా నాపే జరుగుతున్న దుష్ప్రచారాన్ని పోనీలే అని వదిలేశా. నాపై ఎందుకింత ద్వేషం. ట్రోల్స్‌తో నన్ను ఆడుకుంటున్నారు. మీ ట్రోల్స్ నన్నే కాకుండా నా సన్నిహితులనూ బాధపెడుతున్నాయి. మీకు నేను నచ్చకపోతే.. నా మీద నెగిటివిటి ప్రచారం చేయాలని లేదు. రోజుకు రోజుకు నేను చేసే పని ప్రాముఖ్యత నాకు తెలుసు. సినిమాల ద్వారా మిమ్మల్ని అలరించడానికే నేను ప్రయత్నిస్తున్నాను నాకు ఎవరి మీదా ద్వేషం లేదు.

కానీ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడం.. నాపై నెగిటివిటిని వ్యాప్తి చేయడం హృదయాన్ని బాధిస్తుంది. అవి నన్ను నిరుత్సాహపరుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ఇంటర్వ్యూలలో నేను చెప్పని విషయాలు నాకు వ్యతిరేకంగా మారుస్తున్నారు. నాకు ఇండస్ట్రీలో, బయట ఉన్న సత్సంబంధాలపై అనేక రూమర్స్ వస్తున్నాయి. నేను కేవలం నిర్మాణత్మక విమర్శలను మాత్రమే స్వాగతిస్తాను. ఎందుకంటే అవి నన్ను నేను మరింత మెరుగుపరచడానికి తోడ్పడతాయి. కానీ నాపై ఇంత నీచమైన నెగిటివిటి, ద్వేషం ఎందుకు? చాలా రోజులుగా ఈ కథనాలను వదిలేశాను. అభిమానులు.. ప్రియమైన వారి ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

మీలో కొందరు నాపై చూపిస్తున్న ప్రేమకు రుణపడిపోయాను. వారి ప్రేమే ఎల్లప్పుడు నన్ను మరింత ముందుకు నడిపిస్తుంది. ఆ ప్రేమే ఇప్పుడు ఇలా నా మనసులోని మాటలను చెప్పేందుకు దైర్యాన్ని ఇచ్చింది. నేను మీ కోసం కష్టపడి పనిచేస్తూనే ఉంటారు. మిమ్మల్ని అలరించేందుకు మరింత కష్టపడతాను. మీ సంతోషం.. నాకు సంతోషాన్నిస్తుంది.
మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు నా వంతు ప్రయత్నం నేను చేస్తాను.. ధన్యవాదాలు ” అంటూ రష్మిక ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

ఇదీ చదవండి: బ్యాంకాక్‌లో పుష్ప: ది రూల్ షూటింగ్

Exit mobile version
Skip to toolbar