Site icon Prime9

Brahmastra: తెలుగు అభిమానుల కోసం తెలుగులో మాట్లాడినా రణబీర్ కపూర్

Ranbir Kapoor speaks in Telugu for Telugu fans

Ranbir Kapoor speaks in Telugu for Telugu fans

Brahmastra: బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్ర‌హ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జ‌ర‌గాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. నేను కొన్ని విషయాలు మీతో పంచుకొని, తార‌క్‌తో మాట్లాడదామ‌ని స్టేజి ఎక్కానని అన్నారు ఈ సంద‌ర్భంగా రణబీర్ కపూర్ తెలుగు అభిమానుల కోసం తెలుగు మూడు రోజులు నేర్చుకొని రణబీర్ మాట్లాడుతూ ‘నా జీవితంలో బిగ్గెస్ట్ సినిమా బ్ర‌హ్మాస్త్ర‌. బిగ్గెస్ట్ ఈవెంట్ కూడా ఇదే. మంచి సినిమాను ముందుకు నడిపించడానికి తెలుగు అభిమానులు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు అభిమనులందరికి పెద్ద థాంక్స్‌ మా బ్ర‌హ్మాస్త్ర సినిమా కూడా మీ అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆశిస్తున్నాను. ఈ ఈవెంట్‌కి విచ్చేసిన అక్కినేని అభిమానులకు, నంద‌మూరి అభిమానులకు రాజ‌మౌళిగారి అభిమానులకు, తెలుగు అభిమానులందరికి పెద్ద థాంక్స్ బ్ర‌హ్మాస్త్ర సినిమా పార్ట్ 2 స‌మ‌యానికి తెలుగు బాగా నేర్చుకుంటాని తన మాటల్లో చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న తెలుగు అభిమానులు మొదటి సారి ఐన తెలుగు పదాలు స్పస్టంగా మాట్లాడారని తెలుగు అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

ఈ సినిమా అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వహించారు.బ్ర‌హాస్త్ర సినిమా పార్ట్ 1, పార్ట్ 2 ఉన్నాయని తెలిసిన సమాచారం.ఈ సినిమా సౌత్ ఇండియాలో రాజ‌మౌళి స‌మ‌ర్ప‌ణ‌లో అభిమానుల ముందుకు రానుంది.ఇంకా ఈ సినిమాలో అలియా భట్, అమితాబ్ బ‌చ్చ‌న్‌,నాగార్జున‌, నటీనటులు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర‌ల్లో న‌టించారు.

Exit mobile version