Site icon Prime9

Rana Daggubati : సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ 170 మూవీలో రానా, ఫహాద్, అమితాబ్.. పోస్టర్స్ రిలీజ్

rana daggubati, amitabh and fahad playing roles in rajini 170 movie

rana daggubati, amitabh and fahad playing roles in rajini 170 movie

Rana Daggubati : యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అభిమానులకు చేరువయ్యాడు రానా. అయితే రానా నాయుడు వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా అలరించినప్పటికి థియేటర్ లో మాత్రం రానా మళ్ళీ కనిపించలేదు.

అయితే ఇటీవల నిఖిల్ నటించిన స్పై సినిమాలో గెస్ట్ రోల్ లో నటించి అదరగొట్టారు. కాగా ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ లో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘జై భీమ్’ సినిమా దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమా (Thalaivar 170) చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రజినీ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటించిన చిత్రం “జైలర్”. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ల సునామీ సృష్టిస్తుంది. తాజాగా ఈ చిత్రం 600 కోట్లు కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డులు సృష్టించింది. ఈ సినిమా సూపర్ స్టార్ కి అదిరిపోయే కం బ్యాక్ ఇచ్చింది అని చెప్పాలి.

దాంతో జ్ఞానవేల్ తో చేయబోయే మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో తెరకెక్కిస్తున్న ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీలో నటిస్తున్న వారి పోస్టర్ లను ఒక్కొక్కటిగా మూవీ యూనిట్ రిలీజ్ చేస్తుంది. ఇందులో మంజూ వారియ‌ర్, రితికా సింగ్, దుషారా విజయన్ నటిస్తున్నట్లు పోస్టర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి కూడా నటించబోతున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలిపారు. ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ సినిమాలో రానా నటిస్తుండడంతో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి అని తెలుస్తుంది. అలానే ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్ కూడా ముఖ్య పాత్రలు చేస్తుండడంతో అభిమానులు, పలువురు నెటిజన్లు ఈ పోస్టర్ లని షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

 

మరోవైపు రజినీ ప్రస్తుతం తన కూతురు ఐశ్వర్య ర‌జినీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న “లాల్ స‌లామ్‌” అనే సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యంగ్ హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ర‌జినీకాంత్ ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తుండడం గమనార్హం. దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో ఐశ్వర్య మెగా ఫోన్ పట్టుకుంటుండగా.. న‌టి జీవిత రాజశేఖర్ కూడా ఈ సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోండగా.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీలో రజినీకాంత్ ‘మొయ్దీన్ భాయ్‌’గా క‌నిపించ‌నున్నాడు.

Exit mobile version