Site icon Prime9

Adipurush : చరిత్ర సృష్టించనున్న ప్రభాస్ “ఆదిపురుష్”.. నరాలు కట్ అయ్యే లెవెల్ లో ‘రామ్ సియా రామ్’ సాంగ్ రిలీజ్

ram siya ram song from prabhas adipurush movie release time fixed

ram siya ram song from prabhas adipurush movie release time fixed

Adipurush : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం “ఆదిపురుష్”. సుమారు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ఈ మూవీని టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా రిలీజ్ కానుంది.

టీజర్ తో మూవీపై భారీగా నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ట్రైలర్ తో ఆ నెగిటివిటీ అంతా తుడిచిపెట్టుకు పోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన జై శ్రీరామ్ సాంగ్ అయితే అందరికీ గూస్ బంప్స్ తెప్పించింది.  100 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన ఈ ఒక్క పాట మంచి చాట్ బస్టర్ లాగా మారింది. ఈ తరుణంలోనే ఈ మూవీ నుంచి తాజాగా మరో అప్డేట్ రానుంది. సినిమా రిలీజ్ కి మరో మూడు వారాలు మాత్రమే ఉన్న నేపధ్యంలో ఆదిపురుష్ మేకర్స్ ప్రమోషన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు ఈ టీమ్ చేయబోతున్న ఫీట్ చరిత్ర సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదని చెప్పాలి.

Image

నెక్స్ట్ లెవెల్ లో సాంగ్ రిలీజ్ కి ప్లాన్ (Adipurush)..

తాజాగా ఈ మూవీ (Adipurush) నుంచి ‘రామ్ సియా రామ్’ అనే సాంగ్ ని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి రిలీజ్ చేయనున్నారు. అయితే సాధారణంగా యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడమే కాకుండా మూవీ ఛానెల్స్, మ్యూజిక్ ఛానెల్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 70కి పైగా రేడియో స్టేషన్స్, నేషనల్ మీడియా, అవుట్ డోర్ బిల్ బోర్డ్స్, మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్, టికెటింగ్ పార్టనర్స్, సినిమా థియేటర్స్, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ తో పాటు అన్ని ప్రధాన సోషల్ మీడియా వేదికలపై మధ్యాహ్నం 12గంటలకు ‘రామ్ సియా రామ్’ పాటను ఒకే సమయంలో ఒకేసారి వినిపించబోతున్నారు.

దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ అండ్ లైవ్ పెర్ఫార్మెన్స్ లో ‘రామ్ సియా రామ్’ సాంగ్ ఒకేసారి ప్లేకానుందని తెలుస్తుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఈ సాంగ్ ని సచేత్ – పరంపర కంపోజ్ చెయ్యడంతో పాటు వారే పాడడం విశేషం. జై శ్రీ రామ్ సాంగ్ ని అద్భుతమైన లిరిక్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి “రామ్ సియా రామ్” సాంగ్ కి కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ భీభత్సమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊచకోత కోస్తుండగా ఇక సాంగ్ రిలీజ్ అప్పుడు ఊహించుకోవడానికే నెక్స్ట్ లెవెల్ అనే క్యూరియాసిటీ అందరి లోనూ నెలకొంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అంతా 12 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

 

Exit mobile version