Site icon Prime9

Skanda Movie : ‘స్కంధ’ గా రానున్న రామ్ పోతినేని.. ఊర మాస్ గా టైటిల్ గ్లింప్స్

ram pothineni and boyapati film titled as skanda and glimpse goes viral

ram pothineni and boyapati film titled as skanda and glimpse goes viral

Skanda Movie : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని – మాస్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ప్రేక్షకుల్లో గట్టి అంచనాలే నెలకొన్నాయి. పక్కా ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకోగా.. రాపో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, సయీ మంజ్రేకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రామ్ కూడా ఈ సినిమా లుక్ కోసం బాగా మెకోవర్ అయినట్లు కనబడుతుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ జరిగినట్టు ప్రకటించి, సినిమాని 15 సెప్టెంబర్ 2023న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రయూనిట్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది.

అయితే ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ని అనౌన్స్ చేయకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. కాగా ఈ మేరకు తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాకు ‘స్కంధ’ అనే టైటిల్ ని ఫిక్స్ చేయగా.. “ది అటాకర్” క్యాప్షన్ ఇచ్చారు. అలానే రామ్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా లాగా టైటిల్ గ్లింప్స్ కూడా తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ చేశారు. గ్లింప్స్ విషయానికొస్తే.. రామ్ పోతినేని చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. యాక్షన్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంటుందని తెలుస్తోంది. మాస్ గ్లింప్స్ లో రామ్ చెప్పిన ‘మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు’ డైలాగ్ చాలా మాస్ గా ఉండటంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

కాగా శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అలానే మూవీ టైటిల్ “స్కంధ” (Skanda Movie) అంటే కుమారస్వామి అని అర్ధం వస్తుంది. కుమారస్వామి దేవతలకు సైన్యాధిపతిగా ఉండి యుద్ధాలను గెలిపిస్తాడు అని పురాణాల్లో ఉంటుంది. ఈ సినిమాలో రామ్ కూడా కుమారస్వామి లాగా ఎవరి కోసం అయినా యుద్ధం చేస్తూ ఉంటాడేమో అభిమానులు భావిస్తున్నారు. చివరిగా బోయపాటి ‘అఖండ’తో భారీ బ్లాక్ బాస్టర్ అందించిన విషయం తెలిసిందే. ఇక ‘స్కంద’ కూడా పక్కా హిట్ అనేలా హైప్ క్రియేట్ అయ్యింది.

 

Exit mobile version