Magadheera Rerelease : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. పర్సనల్, ప్రొఫెషనల్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. అదరగొడుతున్నారు. చరణ్ ఇప్పుడు అమెరికాలో సందడి చేస్తున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అందించే అవార్డ్ ప్రధానోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు చరణ్. ఈ క్రమంలో అమెరికాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో కూడా పాల్గొన్నారు. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. హీరోల పుట్టిన రోజులకు, పలు ముఖ్యమైన సందర్భాల్లో వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మగధీర రీ రిలీజ్ కి సిద్దం అయ్యింది.
మగధీర రీ రిలీజ్ ఎప్పుడంటే..?
ఈ మూవీ రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ఎన్నో రికార్డ్స్ సాధించిన ఈ సినిమాను రీరిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మార్చ్ 27కి రిలీజ్ చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ప్రకటించారు తమ సోషల్ మీడియా పేజ్ లో ఈ ప్రకటన ఇచ్చారు. దీనితో ఈ అప్డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. మగధీర సినిమాతోనే కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టారు. 13 ఏళ్ల క్రితమే కనీవినీ ఎరుగని విధంగా భారీ బడ్జెట్ తో.. మగధీర సినిమాను నిర్మించి సాహసం చేశారు గీతా ఆర్ట్స్. అప్పట్లోనే పాన్ ఇండియా సినిమాలకు ధీటుగా అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా.. మగధీర సినిమా దానికి మూడింతలు వసూలు చేసింది.
On the occasion of 𝐌𝐄𝐆𝐀 𝐏𝐎𝐖𝐄𝐑𝐒𝐓𝐀𝐑 @AlwaysRamCharan Birthday! 😎
Re-Releasing the Sensational 𝐈𝐍𝐃𝐔𝐒𝐓𝐑𝐘 𝐇𝐈𝐓 #Magadheera in theaters 🔥#MagadheeraReRelease 💥@ssrajamouli @MsKajalAggarwal @mmkeeravaani #AlluAravind @BvsnP @DOPSenthilKumar @GeethaArts pic.twitter.com/aENWnSn23a
— Geetha Arts (@GeethaArts) February 23, 2023
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో కాలభైరవ గా రామ్ చరణ్.. మిత్రబింద గా కాజల్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయేలా నటించి మెప్పించారు. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎన్ని మీమ్స్ వచ్చాయో లేక్కే లేదు. అప్పుడు ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్న మగధీర” చిత్రం మరోమారు ప్రకంపనలు సృష్టించడానికి సిద్దమవుతుంది.
కాగా మరోవైపు గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో లో పాల్గొనే అరుదైన అవకాశం రాంచరణ్ కి దక్కడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న తొలి తెలుగు హీరో, ఇండియన్ స్టార్ ఆయనే. ఈ విషయంలో చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. తాజాగా చరణ్ ఈ షోలో పాల్గొనగా.. ముగ్గురు యాంకర్లు చరణ్ తో చిట్ చాట్ చేశారు. ముందుగా గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో పాల్గొనడానికి చరణ్ స్టూడియో వెళ్లగా.. బయట పెద్ద సంఖ్యలో అభిమానులు మెగా పవర్ స్టార్ కోసం ఎదురుచూశారు. వారందరికి రాంచరణ్ సెల్ఫీలు ఇచ్చాడు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/