Site icon Prime9

Ram Charan : అరుదైన గౌరవం దక్కించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

Ram Charan got place in actors branch of academy awards

Ram Charan got place in actors branch of academy awards

Ram Charan :  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇక ప్రస్తుతం తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం.. ఫ్యామిలీతో కలసి ఇటలీ వెళ్లారు. వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా కూడా మారాయి.

అయితే తాజాగా రామ్ చరణ్  (Ram Charan) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో.. ఇప్పుడు ఆస్కార్‌ యాక్టర్స్‌ బ్రాంచ్‌లోనూ చోటు దక్కించుకొని హాట్ టాపిక్ గా నిలిచారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించినందుకు గాను ఆయనకు ఇందులో స్థానం లభించినట్లు తెలుస్తుంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఇటీవల యాక్టర్స్‌ బ్రాంచ్‌లోకి కొంతమంది కొత్త సభ్యులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రకటించగా..  తాజాగా మరికొంతమంది ప్రతిభావంతులైన నటీనటులకు దీనిలో చోటు కల్పించింది.

‘ఎంతో అంకిత భావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించారు. ఎన్నో సినిమాల్లో వారి నటనతో పాత్రలకు ప్రాణంపోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభవాలను అందిస్తున్నారు. భావోద్వేగాలను పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు’ అని అకాడమీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. ఈ లిస్ట్ లో చరణ్  స్థానం దక్కించుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక చెర్రీ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్‌ ఛేంజర్‌” అనే మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జే.సూర్య, సునీల్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ చిత్రంలోని తొలిపాటను విడుదల చేయనున్నారు. పొలిటికల్‌ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రాబోతుంది.

Exit mobile version