Ram Charan Game Changer Movie Teaser Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్నచిత్రమిది. దీంతో గేమ్ ఛేంజర్‌పై ఫ్యాన్స్, ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల క్రితమే సట్స్‌పైకి వచ్చిన ఈ సినిమా స్లో స్లోగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘గేమ్ ఛేంజర్’ వచ్చే ఏడాది జనవరి 10న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 9న గ్రాండ్‌గా ప్లాన్ చేశారు మేకర్స్.
పాన్ ఇండియాగా రూపొందిన ఈ సినిమా టీజర్‌ని ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో విడుదల చేస్తున్నట్టు ఇటీవల ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్నోతో పాటు మూడు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లో టీజర్‌ని లాంచ్ చేస్తున్నారు. ఈ మేరకు టీజర్ విడుదల చేసే థియేటర్ల జాబితాను విడుదల చేసింది మూవీ టీం. నవంబర్ 9న గేమ్ ఛేంజర్ టీం లక్నో టీజర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహిస్తోంది. అదే టైంలో ఏపీ, బెంగళూరు థియేటర్లోను టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. మూడు రాష్ట్రాల్లో మొత్తం 11 థియేటర్లో గేమ్ ఛేంజర్ టీజర్ ఒకేసారి లాంచ్ కానుంది. ఈ మేరకు మూవీ టీం థియేటర్లో లిస్ట్ ప్రకటిస్తూ తాజాగా అప్‌డేట్ ఇచ్చింది.
మూడు రాష్ట్రాల్లో 10 థియేటర్‌లో
రామ్ చరణ్, కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని పోలిటికల్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు శంకర్. ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా రెండు నెలలు మాత్రమే ఉంది. దీంతో మూవీ టీజర్ లాంచ్‌కి ముహుర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా నార్త్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌కు భారీగా ప్లాన్ చేశారు. లక్కోని ప్రతిభ థియేటర్లో టీజర్ విడుదల చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, బెంగళూరులోని పలు థియేటర్లోనూ మూవీ టీజర్ లాంచ్‌కి అంతా రంగం చేసినట్టు ప్రకటన ఇస్తూ థియేటర్ల పేర్లు వెల్లడించారు.
ఈ థియేటర్‌లోనే టీజర్ చూసేయండి!
1. ప్రతిభ థియేటర్ – లక్నో
2. సుదర్శన్ థియేటర్ – హైదరాబాద్
3. శివజ్యోతి – రాజమండ్రి
4. సంగాం-శరత్ – వైజాగ్
5. శైలజ – విజయవాడ
6. వీ మెగా – కర్నూల్
7. ఊర్వశీ థియేటర్ – బెంగళూరు
8. త్రివేణి – అనంతపూర్
9. పీజీఆర్ – తిరుపతి
10. ఎస్2 థియేటర్ – బెంగళూరు
11. ఖమ్మం – ఎస్‌వీసీ శ్రీ తిరుమల
కాగా గేమ్ ఛేంజర్‌లో ఎస్‌జే సూర్య, నటి అంజలి, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని, జయరాం, నాజర్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌వీసీ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.