Rajamouli: RRR చిత్రంతో హాలీవుడ్ ప్రశంసలు పొందిన టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్బంగా స్పీల్ బర్గ్ ను కలిసిన ఫోటోను షేర్ చేసుకున్నారు. రాజమౌళి వెంట సంగీత దర్శకుడు కీరవాణి కూడ ఉన్నారు.
నేను ఇప్పుడే దేవుడిని కలిశాను అంటూ ఆ ఫోటోలను పోస్ట్ చేస్తూ రాజమౌళి రాసారు. రాజమౌళి(Rajamouli) చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
మొదటి ఫోటో అతను స్పీల్‌బర్గ్‌ను ఎక్సైటింగ్ గా చూస్తున్నట్లు ఉండగా రెండవఫోటోలో కీరవాణి, స్పీల్ బర్గ్ తో కలిస ఉన్నారు.
దీనితో నెటిజన్లు వీరి సమావేశం గురించి ట్వీట్లు చేస్తున్నారు. #StevenSpielberg ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
మరోవైపు కీరవాణి కూడా స్పీల్‌బర్గ్‌ని కలవడం గురించి ఇలా ట్వీట్ చేసారు. సినిమాల దేవుడిని కలుసుకునే అవకాశం వచ్చింది.
డ్యూయెల్‌తో సహా అతని సినిమాలను నేను ఇష్టపడతానని అతని చెవుల్లో చెప్పాను
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్
RRRచిత్రంతో రాజమౌళి పేరు ప్రపంచమంతా పాకింది. ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కింది.
‘ఆస్కార్స్’కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఈ సాంగ్ షార్ట్ లిస్ట్ అయింది.
రాజమౌళి త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తోంది.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ యొక్క సెమీ-ఆటోబయోగ్రాఫికల్ మూవీ ‘ది ఫాబెల్‌మాన్స్’ భారత్ లో విడుదలకు సిద్దమవుతోంది.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ దర్శకత్వం వహించిన, ది ఫాబెల్‌మాన్స్‌ను స్పీల్‌బర్గ్ మరియు పులిట్జర్ ప్రైజ్-విజేత నాటక రచయిత టోనీ కుష్నర్ (ఏంజెల్స్ ఇన్ అమెరికా, కరోలిన్, లేదా చేంజ్) రచించారు.
అతను స్పీల్‌బర్గ్ యొక్క లింకన్ మరియు మ్యూనిచ్ స్క్రీన్‌ప్లేలకు ఆస్కార్ నామినేషన్లను సంపాదించాడు.
ఈ చిత్రాన్ని ఆంబ్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ & రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి.
స్టీవెన్ స్పీల్‌బర్గ్ సినిమాలు ఇవే..
జురాసిక్ పార్క్- 1993
సంథింగ్ ఈవెల్ – 1972
డ్యుయల్- 1971 ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తీశారు ఈ దర్శక దిగ్గజం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/