Site icon Prime9

SS Rajamouli : ఫారెస్ట్ అడ్వెంచర్ గా రాజమౌళి _ మహేష్ బాబు మూవీ

Rajamouli

Rajamouli

Tollywood News: దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబు తో తను చేయబోయే చిత్రానికి ప్రాథమిక కథాంశం సిద్ధంగా ఉందని, ఇది ఫారెస్ట్ అడ్వెంచర్ అని స్వయంగా ప్రకటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మరియు ఎస్ఎస్ కాంచి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం రాజమౌళి వచ్చే నెలలో వీరితో జాయిన్ అవుతారు.

ఈ భారీ చిత్రం షూటింగ్ జూన్ 2023లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ప్రకటించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నట్టు ఆయన వెల్లడించారు. త్రివిక్రమ్ తమ రాబోయే ప్రాజెక్ట్ షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని మహేష్ బాబు కోరుకుంటున్నారు. తరువాత అతను రాజమౌళి సినిమా సెట్స్‌లో జాయిన్ అవుతారు.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెని సంప్రదించారు. ఈ సినిమా కోసం రాజమౌళి పలువురు హాలీవుడ్ నటీనటులను కూడా పరిశీలిస్తున్నారు. కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి ఒక టాప్ హాలీవుడ్ స్టూడియో కూడ సహకరించనుంది. రాజమౌళి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా.

Exit mobile version