Site icon Prime9

Saranga Dariya : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో “సారంగాదరియా”మూవీ.. టైటిల్ & ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రాజ్ తరుణ్

raja ravindra Saranga Dariya movie poster released by raj tharun

raja ravindra Saranga Dariya movie poster released by raj tharun

Saranga Dariya : ప్రముఖ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజ క్రియేషన్స్ పతాకం పై ఉమాదేవి శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి తాజాగా  “సారంగదరియా” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్,శివ చందు, యశస్విని,మొయిన్ ,మోహిత్,నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్, తదితరులు ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. కాగా ఈ మేరకు తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ చేతులమీదుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయించారు.

ఈ సందర్బంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. సారంగదరియా ఫస్ట్ లుక్ పోస్టర్ నేను విడుదల చెయ్యడం చాలా సంతోషంగా ఉంది పోస్టర్ అండ్ టైటిల్ చూడగానే పాజిటివ్ గా చాలా బాగుంది అనిపించింది ఫ్యామిలీ చిత్రంగా త్వరలో విడుదల కానున్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటిస్తున్న మా రాజా రవీంద్ర అన్నకి ప్రొడ్యూసర్స్ శరత్ చంద్ర గారికి ఉమాదేవికి మరియు ఈ చిత్రంతో డైరెక్టర్ పరిచయం అవుతున్న పద్మారావు అలియాస్ పండు కి “సారంగదరియా” సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

ప్రొడ్యూసర్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. మా ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ అడిగిన వెంటనే విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ కి చాలా థాంక్స్ త్వరలో మూవీ విడుదలకి సన్నాహాలు చేస్తున్నాము మా (Saranga Dariya) “సారంగదరియా” అందరికీ నచ్చేలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ తెలిపారు.

డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి (పండు )మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం నేను “సారంగదరియా” మూవీ తో దర్శకుడిగా పరిచయమవుతున్నను ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి ధన్యవాదాలు. ఈ రోజు మా మూవీ పోస్టర్ విడుదల చేసిన హీరో రాజ్ తరుణ్ గారికి థాంక్యూ. చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన రాజా రవీంద్ర గారికి మా ప్రొడ్యూసర్స్ శరత్ చంద్రకి, ఉమాదేవికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఒక మధ్యతరగతి ఫ్యామిలీ లో జరిగిన కొన్ని ఘర్షణల తో కథ ఉంటుంది. మా చిత్రాన్ని త్వరలో విడుదల చెయ్యాలి అనుకుంటున్నాము త్వరలోనే మిగతా విషయాలు తెలియజేస్తామని అన్నారు.

Exit mobile version