Site icon Prime9

Pushpa: ’పుష్ప’ ఆడియోకు 500 కోట్ల వ్యూస్

Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘పుష్ప – ది రైజ్’ మరో రికార్డును నెలకొల్పింది భారతదేశంలో 5 బిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఆల్బమ్‌గా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. సోషల్ మీడియాలో చిత్ర నిర్మాతలు పోస్టర్‌ను పంచుకున్నారు

భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద ఫీట్
ఐకాన్ స్టార్
@అల్లుఅర్జున్
యొక్క #PushpaTheRise 5 బిలియన్ వ్యూస్ కొట్టిన మొదటి ఆల్బమ్ అంటూ మైత్రీ మూవీమేకర్స్ ట్వీట్ చేసారు.

దాక్కో దాక్కో మేక, ఊ అంటావా మావా, శ్రీవల్లి, ఏయ్‌ బిడ్డా పాటలు అభిమానులను ఉర్రూతలగించాయి. దాంతో, ఈ సినిమాలోని మొత్తం పాటలన్నీ కలిపి 500 కోట్ల వ్యూస్‌ ను దక్కించుకున్నాయి. ‘ఊ అంటావా ఊ అంటావా’ ఈ ఏడాది అతిపెద్ద పార్టీ గీతంగా నిలిచింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’ అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లు వసూలు చేసింది.

Exit mobile version