Site icon Prime9

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌తో దిల్‌ రాజు భేటీ – ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా..

Dil Raju Meets Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌తో నిర్మాత, టీఎస్‌ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో సోమవారం పవన్‌ను కలిశారు. ఆయన నిర్మించిన రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ మూవీ రిలీజ్‌ నేపథ్యంలో ఆయనను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ టికెట్‌ రేట్ల పెంపుతో పాటు విజయవాడ నిర్మించే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై ఆయనతో చర్చించారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

కాగా నిన్న ఆదివారం విజయవాడలో జరిగిన రామ్‌ చరణ్‌ భారీ కటౌట్‌ ఆవిష్కరణకు దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేమ ఛేంజర్‌ ఈవెంట్‌ పవన్‌ కళ్యాణ్‌ గారు చీఫ్‌ గెస్ట్‌గా రానున్నారని చెప్పారు. ఇదే విషయమై తాజాగా దిల్‌ రాజు ఆయనను కలిసి ఆహ్వానించగా.. హజరవుతానని పవన్‌ కళ్యాణ్ చెప్పినట్టు గేమ్‌ ఛేంజర్‌ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ ఎక్స్ వేదిక పేర్కొంది. అదే విధంగా విజయవాడలో భారీ స్థాయిలో నిర్వహించే గేమ్‌ ఛేంజర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. కాగా గేమ్‌ ఛేంజర్‌ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా రామ్‌ చరణ్‌ యువశక్తి అధ్వర్యంలో అభిమానులు ఆయన భారీ కటౌట్‌ని ఏర్పాటు చేశారు. 256 అడుగుల కటౌట్‌ని బృందావన కాలనీలో వజ్రా మైదానంలో ఈ కటౌట్‌ని భారీ ఎత్తున ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దిల్‌ రాజు ముఖ్య అతిథిగా హజరై ట్రైలర్‌ రిలీజ్‌ అప్‌డేట్‌తో పాటు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గేమ్‌ చేంజర్‌లో రామ్‌ చరణ్‌ నట విశ్వరూపాన్ని చూస్తారంటూ హైప్‌ పెంచారు. ఇక ట్రైలర్‌ జనవరి 1న విడుదల చేస్తామన్నారు. అలాగే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని భారీ ఎత్తున్న ప్లాన్‌ చేస్తున్నామని, దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారని దిల్‌ రాజు చెప్పారు.

Exit mobile version