Site icon Prime9

OG Movie : వరుస అప్డేట్ లతో ఫ్యాన్స్ కి హై ఫీస్ట్ ఇస్తున్న OG టీమ్.. పవన్ స్టార్ కి జోడీగా ప్రియాంక మోహన్

priyanka mohan going act as heroin in pawan kalyan og movie

priyanka mohan going act as heroin in pawan kalyan og movie

OG Movie : పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది. కాగా  మంగళవారం నాడు పవన్ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న OG సినిమా సెట్లోకి పవన్ అడుగుపెట్టాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ముంబైలో మొదలవ్వగా పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి షూట్ లో జాయిన్ అయ్యారని సెట్ లో పవన్ ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి. ఆ ఫొటోల్లో పవన్ లుక్ అదిరిపోయింది అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో పవన్ సరసన నటించే హీరోయిన్ ని ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ  కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్ OG సినిమాలో పవన్ సరసన నటించబోతోందని అధికారికంగా ప్రకటించారు. ప్రియాంక కూడా సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టు సమాచారం. ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ OG సినిమా నుంచి అప్డేట్స్ ఇస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

గ్యాంగ్ లీడర్ సినిమాతో ప్రియాంక అరుళ్ మోహన్ టాలీవుడ్ కి పరిచయమైంది. తనదైన అందం, అభినయంతో మొదటి సినిమాతోనే యవిత అందర్నీ ఫిదా చేసిన ఈ భామ.. వారి హృదయాలను కొల్లగొట్టేసింది. అయితే ఈ మవవీ ఇచ్చిన సక్సెస్ తో టాలీవుడ్ లో హవా కొనసాగించడం ఖాయమని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత శర్వానంద్ తో  ‘శ్రీకారం’ సినిమా చేయగా అది ఫ్లాప్ గా నిలిచింది. దీంతో తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ భామ. ఇక శివ కార్తికేయన్ సరసన ‘డాక్టర్’ సినిమాతో భారీ హిట్ ను అందుకున్న ప్రియాంక, అక్కడ తన జోరు చూపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పవన్ – సుజీత్ కాంబినేషన్లోని సినిమా నుంచి ఆమెకి ఛాన్స్ దక్కిందని భావిస్తున్నారు. తెలుగులో రెండు ఫ్లాపులతో వెనుకబడిన హీరోయిన్ కి పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కడం పట్ల అంతా ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం అంతా చూస్తుంటే ఈసారి సుజిత్ గట్టిగానే హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.

ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ముగింపు దశకు చేరుకోగా, తమిళ దర్శకుడు సముద్రఖని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీలో తన పాత్రకు సంబంధించిన షూట్‌ను ముగించాడు. ఇక హరీష్‌ శంకర్‌ తో చేస్తున్న `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` ఇప్పటికే ఓ షెడ్యూల్‌ పూర్తయ్యింది.

Exit mobile version