Site icon Prime9

Priyanka Chopra : మొదట్లో నన్ను అలా పిలిచే వారంటూ ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా

priyanka-chopra-shocking-comments-on-bollywood

priyanka-chopra-shocking-comments-on-bollywood

Priyanka Chopra : బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి. తన నటనతో, గ్లామర్ తో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యే స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంటుంది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకుంది ప్రియాంకా. ఇటీవలే కొన్ని నెలల క్రితం సరోగసి ద్వారా ఓ పాపకి జన్మనిచ్చింది. మళ్ళీ ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.

కాగా సినిమాల్లోకి రాక ముందు మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకొని తన కంటూ మంచి ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుంది ప్రియాంక. వరుస హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక ఇటీవలే ఇండియాకి వచ్చింది. తన ఫ్యామిలీతో గడిపేందుకు కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ తరుణంలోనే ఓ ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో బాలీవుడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కెరీర్ మొదట్లో తనపై పలువురు చేసిన కామెంట్స్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన ప్రియాంక. ఆమెను డస్కీ అని, నల్ల పిల్లి అని పిలిచే వాళ్లని… మొదట్లో డస్కీ అంటే అర్ధం తెలీదని కానీ ఆ తర్వాత తెలిశాక చాలా బాధపడ్డట్లు వాపోయింది. అదే విధంగా షూటింగ్ సమయంలో కూడా తనని ఎక్కువసేపు వెయిట్ చేయించే వారని తెలిపింది. ప్రస్తుతం ప్రియాంక చేసిన వ్యాఖ్యలు బీ టౌన్ లో సంచలనంగా మారాయి.

Exit mobile version