Prime9

Pawankalyan-Sujith : పవన్ – సుజిత్ చిత్రానికి ప్రభాస్ విషెస్

Tollywood News: దర్శకుడు సుజిత్  దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారు. సుజిత్ పవన్‌కి పెద్ద అభిమాని. పవన్ తో పనిచేయాలన్ని తన కలను నెరవేర్చుకునే సమయం అతనికి వచ్చింది.

సుజిత్ ప్రభాస్‌ని కూడా చాలా అభిమానిస్తాడు. . సుజిత్ తొలి చిత్రం రన్ రాజా రన్‌ను ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మించింది. అతని రెండవ చిత్రం సాహోలో ప్రభాస్ హీరోగా నటించాడు.ప్రభాస్ సుజిత్ పట్ల చాలా ఆప్యాయంగా ఉంటాడు. అతనిని తన తమ్ముడిలా చూసుకుంటాడు. సుజిత్‌ కొత్త చిత్రానికి ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలిపాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మరియు సుజిత్ గారికి అభినందనలు. ఈ కాంబినేషన్ అదిరిపోతుంది. దానయ్య గారికి మరియు టీమ్ మొత్తానికి నా శుభాకాంక్షలు అని అన్నాడు.

ఒకరి కోసం సినిమాల్లోకి వచ్చా. ఇంకొకరి వల్ల ఆ సినిమా తీయగలిగా. మీ ఇద్దరినీ ప్రేమిస్తున్నాను అని ప్రభాస్ కు సుజిత్ బదులిచ్చాడు. పవన్-సుజిత్ ప్రాజెక్ట్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తారు.

Exit mobile version
Skip to toolbar