Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి “ప్రాజెక్ట్ కె”. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తుంది. అలానే దిశా పఠాని, పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ తో ఎప్పటికప్పుడు మూవీపై అంచనాలను రెట్టింపు చేస్తుంది మూవీ టీం.
కాగా తాజాగా కల్కి మూవీ టీం ఒక వార్నింగ్ ఇస్తూ ఒక నోట్ రిలీజ్ చేసింది. మూవీకి సంబంధించిన పిక్స్, వీడియోస్, ఫ్యూటేజ్ వంటివి ఏమీ షేర్ చేసినా వారి పై లీగల్ గా యాక్షన్ తీసుకుంటామంటూ చిత్ర యూనిట్ ఒక నోటీసు రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ నోట్ నెట్టింట వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ విషయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.