Ustaad Bhagath Singh Glimpse : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ముందుగా చెప్పినట్టు తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసేలా పవన్ కళ్యాణ్ లోని స్వాగ్ ని మరోసారి సినిమా దర్శకుడు హరీష్ శంకర్ నెక్స్ట్ లెవెల్లో ప్రెజెంట్ చేశారు. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్.. పవన్ కళ్యాణ్ మేనరిజం.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. అన్నీ కరెక్ట్ గా సెట్ అయ్యి ఫ్యాన్స్ కి ఊరమాస్ ట్రీట్ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ గ్లింప్స్ లో ‘ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది’ అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ జాతర తీసుకురాబోతుందని తెలుస్తుంది.
‘ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో… అధర్మము వృద్ధినోందునో… ఆయా సమయముల అందు, ప్రతి యుగమున అవతారాము దాల్చుచున్నాను’ అని ఘంటసాల వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ మొదలు అవుతుంది. ఆ తర్వాత లుంగీ కట్టిన పవన్ కళ్యాణ్.. ‘భగత్ సింగ్.. మహంకాళి పోలీస్ స్టేషన్, అఫ్జల్ గంజ్! పాతబస్తీ’ అని చెప్పగా.. బ్యాగ్రౌండ్లో భగత్ భగత్ అంటూ డైలాగ్ వస్తుంది. ఆ తర్వాత కొంతమంది కూర్చొని ఉంటే వారి ఎదుట పవన్ నిలబడి తన మేనరిజం .. మెడ మీద చేయి పెట్టుకోవడం.. హీరోయిన్ ని చూపించకుండా బ్యాక్ నుంచి చూపించి .. కొంచెం సస్పెన్స్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా పవన్ వాకింగ్ స్టైల్, కళ్ళజోడు పెట్టుకుని చేతులు ఊపే స్వాగ్ అదిరిపోయింది. లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మొత్తానికి ఈ వీడియో అయితే పర్ఫెక్ట్ పవన్ స్టార్ మానియా ని క్రియేట్ చేసిందని చెప్పాలి.
ఇక గతంలో పవన్ – హరీష్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయం అందుకుందో తెలిసిన విషయమే. ఈ బ్లాక్ బస్టర్ హిట్ రిలీజ్ అయిన 11 ఏళ్ల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై హైప్ క్రియేట్ చేయగా.. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్స్ ఆ అంచనాలను మరో లెవెల్ కి తీసుకుపోయింది. ఇక ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తుంది. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతుంది. మిళ్ సూపర్ హిట్ సినిమా ‘తేరి’కి రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు.