Site icon Prime9

Pushpa 2: పుష్ప-2 ఫ్రారంభం

Tollywood: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూలు చేసింది.

ఇలాఉండగా నిర్మాతలు నేడు పుష్ప ది రూల్ లాంఛనంగా పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. ఈ రోజు ఉదయం 8.15 గంటలకు సినిమా లాంచ్ అయింది త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కూడా డీఎస్పీ సంగీతం అందించనుండగా, సీక్వెల్‌లో శ్రీవల్లి పాత్రలో రష్మిక మళ్లీ నటిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా టాలీవుడ్ స్ట్రైక్ కారణంగా వాయిదా పడింది. సెప్టెంబరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. మరియు షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు, ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ తమ పాత్రలను మళ్లీ పోషించనున్నారు.

Exit mobile version