Site icon Prime9

Payal Rajput : అల్లు అర్జున్ తో పాయల్ .. తగ్గేదేలే అంటూ సెల్ఫీ ..

payal rajputh and allu arjun selfie pic gone viral

payal rajputh and allu arjun selfie pic gone viral

Payal Rajput : టాలీవుడ్ నటి పాయల్ రాజ్ పుత్ ప్రస్తుతం డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మంగళవారం’ సినిమా లో ఒక ముఖ్య పాత్ర పోషించింది . ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కానుంది. తాజాగా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న నవంబర్ 11న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి సందడి చేశారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో సినిమాపై ఆసక్తి పెంచారు.
ఒక గ్రామంలో జరిగే హత్యల నేపథ్యంలో డార్క్ థ్రిల్లర్ గా మంగళవారం సినిమా ఉండబోతుంది.ట్రైలర్ లో పాయల్ రాజ్ పుత్ హాట్ సీన్, షాకింగ్ ట్విస్ట్ లు, అదిరిపోయే బిజీఎం, ఆకట్టుకుంటుకున్న విజువల్స్ తో ఎమోషన్స్ సీన్స్ కూడా చూపించారు. ఇక సినిమాలో ఇంతకీ ఆ మాస్క్ ధరించేది ఎవరు.. వంటి సస్పెన్స్ అంశాలు ఇంటరెస్టింగ్ గా మారాయి.ఈ సినిమాని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ అండ్ ట్రైలర్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. సినిమా పై మంచి బజ్‌ని, క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి.

ఇక అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కి రావడంతో బన్నీ అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. ఈ ఈవెంట్ నుంచి అల్లు అర్జున్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మంగళవారం సినిమా హీరోయిన్, RX100 భామ పాయల్ రాజ్ పుత్ అల్లు అర్జున్ తో స్పెషల్ సెల్ఫీ తీసుకుంది. పుష్ప స్టైల్ లో తగ్గేదేలే అంటూ పాయల్, బన్నీ ఇద్దరూ ఫోజిస్తూ సెల్ఫీ తీసుకున్నారు.ఈ సెల్ఫీలని పాయల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇవి వైరల్ గా మారాయి.

ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ జరుగుతుందని తెలిపాడు. వచ్చే సంవత్సరం ఆగస్టు 15 పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు చిత్రయూనిట్.ఫ్యాన్స్ పుష్ప 2 సినిమా గురించి అడగడంతో బన్నీ మంగళవారం సినిమా గురించి మాట్లాడిన తర్వాత పుష్ప అప్డేట్ ఇచ్చారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఇప్పుడు నేను పుష్ప షూట్ నుంచే వచ్చాను. రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. లాస్ట్ టైం రిలీజ్ చేసిన జాతర పోస్టర్ చూసారు కదా, ఆ జాతర షూట్ జరుగుతుంది. అందుకే చేతులకు ఇంకా నెయిల్ పాలిష్, పసుపు ఉన్నాయి. మీరు ఊహించిన దానికన్నా మించి ఉంటుంది పుష్ప 2. ప్రస్తుతానికి ఇదే అప్డేట్. సినిమా రిలీజయ్యాక మీరే చూస్తారు అని చెప్పారు.

Exit mobile version