Pawan Kalyan – Sai Tej Movie : మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్ లో #OG సినిమాలు చేస్తున్నారు. కాగా గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తుంది. కానీ దీనికి సంబంధించి ఇన్ని రోజులుగా ఎవరు ఒక అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కూడా అయోమయంలో ఉన్నారు.
కాగా తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో చేయనున్న సినిమాని అఫిషియల్ గా ప్రకటించారు. తమిళంలో సూపర్ హిట్ అయిన “వినోదయ సిత్తం” అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీకి సముద్రఖని దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌ను నేడు ప్రారంభించారు. ఈ మేరకు స్టిల్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మామ, అల్లుళ్లను ఇలా చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతకు అల్లు అర్జున్, రామ్ చరణ్ కలిసి ఎవడు సినిమా చేయగా.. అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నాళ్ళకు మెగా హీరోలు ఇద్దరు కలిసి నటిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే మరోవైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ కూడా ఇప్పుడు రీమేక్‌ల మీద పడ్డారనే వార్తలు మరింత జోరందుకుంటున్నాయి. ఇప్పటికే చిరంజీవి చేసిన, చేస్తున్న.. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలన్నీ కూడా రీమేక్‌లే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఎక్కువగా రీమేక్‌ల మీదే ఫోకస్ పెట్టడంతో అభిమానులు నిరాశకి గురవుతున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేక్ లు కాగా.. హరీష్ శంకర్ చేయబోయే సినిమా కూడా తేరి రీమేక్ అని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఒక వైపు హ్యాప్పీగా ఉన్నప్పటికీ.. మరోవైపు నిరాశకు లోనవుతున్నారని తరోల్స్ చేస్తున్నారు. అయితే వినోదయ సిత్తం సినిమాను రీమేక్ చేయడంలోనూ త్రివిక్రమ్ హస్తమే ఉందని టాక్. ఇక వినోదయ సిత్తం తెలుగు వర్షన్‌కు త్రివిక్రమే స్క్రిప్ట్ రచించాడని, త్రివికమ్ పంచ్ డైలాగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయని తెలుస్తోంది. త్రివిక్రమ్ మాటలకు సముద్రఖని డైరెక్షన్ తోడవుతుందన్న మాట. ఇప్పుడు ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా సముద్రఖని పరిచయం కాబోతోన్నాడు.
కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమా స్టోరీగా తెలుస్తుంది. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేయనుండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. దీంతో పవన్ దేవుడి పాత్రలో నటించడం ఇది రెండోసారి అవుతుంది. అంతకు ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి చేసిన ‘గోపాల గోపాల’లో.. పవన్ మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ మూవీతో మామ – అల్లుళ్ళు ఏ రేంజ్ లో అలరిస్తారో చూడాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/