Site icon Prime9

పవన్ కళ్యాణ్ ఖుషి మూవీ రీ రిలీజ్: ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే గిఫ్ట్… న్యూ ఇయర్‌కి డబుల్ బొనాంజా!

pawan kalyan khushi movie re releasing in december 31st

pawan kalyan khushi movie re releasing in december 31st

Khushi Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా గురించి అందరికీ తెలిసిందే. పవన్ కెరీర్ లో 7 వ సినిమాగా వచ్చిన ఈ మూవీకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించగా… భూమిక హీరోయిన్ గా నటించింది. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ ఏ.ఎమ్.రత్నం నిర్మించిన ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలవాడమే కాకుండా పవన్ కెరీర్‌ను కూడా మలుపుతిప్పింది. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్, డ్యాన్సులు, మేనరిజమ్స్ … యూత్ ని వ రేంజ్ లో ఫిదా చేశాయి.

అయితే ఇటీవల కాలంలో హీరోల పుట్టిన రోజులకు, ఏదైనా సదర్భం వచ్చినప్పుడు వారి సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ తరహాలోనే పవన్ ‘గబ్బర్ సింగ్’, ‘జల్సా’ సినిమాల స్పెషల్ షోస్ ని పవన్ పుట్టిన రోజు నాడు వేశారు. కాగా ఇప్పుడు ‘ఖుషి’ మూవీని కూడా రీ రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. 21 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాని 4K Ultra HD క్వాలిటీతో, డీటీఎస్‌తో డిజిటల్‌లోకి కన్వెర్ట్ చేసి క్యూబ్‌లోకి మార్చే ప్రాసెస్ చెయ్యనున్నారు. ఇక ఇప్పటికే పవన్ పుట్టినరోజు సందర్భంగా… ‘ఖుషి ట్రైలర్ రీలోడెడ్’ పేరుతో స్పెషల్‌గా ట్రైలర్స్ కట్ చేయగా నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

డబుల్ బొనాంజా… 

2023 నూతన సంవత్సరం సందర్భంగా 2022 డిసెంబర్ 31న ‘ఖుషి’ మూవీని వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రీ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో ఈ మూవీని రీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులకు ఈ వార్తతో పూనకాలు కన్ఫర్మ్ అని అర్దం అవుతుంది. న్యూ ఇయర్ కానుకగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో… ‘ఖుషి’ నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ నుంచి కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ గా మారింది.

అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 500 షోస్ వేశారు. అంతకు ముందు మహేష్ బాబు పోకిరి సినిమాల షోల కంటే ఇది రేనట్టింపు అని చెప్పవచ్చు. అదే విధంగా ఇక కలెక్షన్ల విషయంలోనూ పోకిరిని మించి పోయింది జల్సా. నైజాంలో 1.25కోట్లు, సీడెడ్‌లో 39 లక్షలు, నెల్లూరులో పది లక్షలు, గుంటూరులో పది లక్షలు, కృష్ణాలో 21 లక్షలు, వెస్ట్ 14 లక్షలు, ఈస్ట్ 8 లక్షలు, వైజాగ్‌లో 26 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 22 లక్షలు, ఓవర్సీస్‌లో 40 లక్షలు ఇలా మొత్తంగా 3.2 కోట్ల కలెక్షన్లను రాబట్టేసింది జల్సా సినిమా. కాగా ఇప్పుడు కహశుహయి సినిమాతో మరెన్ని రికార్డులు తిరగరాస్తుందో అని అభిమానుల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది. రికార్డులు తిరగరాయడంలో పవన్ కళ్యాణ్ కి ఎవరూ పోటీ రాలేరు అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

Exit mobile version