Site icon Prime9

Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ సెట్లో అడుగుపెట్టబోతున్న పవన్‌ కళ్యాణ్‌ – ఇదే లాస్ట్‌ షెడ్యూల్‌

Hari Hara Veeramallu Update

Pawan Kalyan Join Hari Hara Veeramallu Shooting: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు తన సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో హరి హర వీరమల్లు, ఓజీ, భగవంత్‌ కేసరి వంటి భారీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ఇందులో ఎక్కువ హైప్‌ ఉంది మాత్రం ఓజీపై సాహో ఫేం సుజిత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఓజీ సెట్లో అడుగుపెట్టలేదు పవన్‌. ప్రస్తుతం హర హర వీరమల్లు షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ నుంచి ఓ క్రేజ్ అప్‌డేట్‌ వదిలింది చిత్ర బృందం.

ఏఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొదటి డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ టేకప్‌ చేశాడు. ప్రస్తుతం ఆయన దర్శకత్వలో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతుంది. రెండేళ్ల క్రితమే సెట్స్‌పై వచ్చిన ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్టు తాజాగా టీం వెల్లడించింది. లేటెస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని ఫైనల్‌ షెడ్యూల్‌లోకి అడుగుపెడుతున్నట్టు తాజాగా మూవీ టీం ట్విట్‌ చేసింది. ఈ మేరకు పవర్‌ అప్‌డేట్‌ అలర్ట్‌ అంటూ ట్వీట్‌ వదిలింది.

“ఎపిక్ బ్యాటిల్‌ కోసం ధర్మ చివరి షూటింగ్‌ షెడ్యూల్లోకి అడుగు వేయబోతున్నాడు. ఈ యుద్దం మీకు గొప్పగా.. ఎప్పటికి గుర్తుండిపోతుందని మేము మీకు హామీ ఇస్తున్నాం. పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ గారు ఈ వారాంతం నుంచి సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు” అంటూ అదిరిపోయే అప్‌డేట్స్‌. ఇది తెలిసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. మొత్తానికి హరి హర వీరమల్లు షూటింగ్‌ పూర్తవుతుందని, సినిమా కోసం వెయిటింగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ఇందులో పవన్‌ కళ్యాణ్‌ పోరాట యోధుడిగా కనిపించబోతున్నారు. ఎపిక్‌ యాక్షన్‌ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ఈ సినిమా తెరకెక్కుతోంది. రెండు భాగాలు రూపొందుతున్న ఈ సినిమా ‘హరి హర వీరమల్లు: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో రూపొందుతుంది. ఫస్ట్‌ పార్ట్‌ వచ్చే 28 మార్చి 2025లో విడుదల కానుంది.

Exit mobile version