Site icon Prime9

Varasudu Movie : దిల్ రాజు బడా ప్లాన్… విజయ్ ” వారసుడు ” ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ ..!

pawan kalyan going to attend vijay varasudu movie pre release event

pawan kalyan going to attend vijay varasudu movie pre release event

Varasudu Movie : దళపతి ” విజయ్ ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ కి మంచి క్రేజ్ ఉందని చెప్పొచ్చు. కాగా స్నేహితుడు, తుపాకి, అదిరింది, విజిల్, బీస్ట్ వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ కి కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ” వారసుడు ” అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, వీడియో లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ తరుణంలోనే సినిమాపై మరింత హైప్ పెంచేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ నెల 24న చెన్నైలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనుండగా… తెలుగులో ఈ నెల 27న పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకకు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే విజయ్ కి ఉన్న స్టార్ డం రీత్యా టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరిని పరి రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా ఆహ్వానించాలని దిల్ రాజు భావిస్తున్నారట. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచినట్లు తెలుస్తుంది.

ఇందుకు పవన్ కూడా ఒకే చెప్పినట్లు ఇండస్ట్రి వర్గాల్లో టాక్ నడుస్తుంది. తమిళ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ కి పేరుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ గురించి ఎంత చెప్పిన తక్కువే. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే తెలుగు రాష్ట్రాలలో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ని దేవుడు లా భావించే భక్తులు ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్నారు. తెలుగు లోనే కాకుండా వివిధ భాషలలోని హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పై అభిమానాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో విజయ్, పవన్ ఒకే స్టేజిపై కనిపించడం అంటే సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టాపిక్ గా మారుతుంది.

కాగా గతంలో పవన్ కళ్యాణ్ ” ఖుషి ” సినిమాని తమిళ లో విజయ్ చేసిన విషయం తెలిసిందే. అలానే పవన్ ” బంగారం ” సినిమా ఈవెంట్ కి కూడా విజయ్ హాజరయ్యారు. ఈ తరుణంలో వీరిద్దరి ఫోటోలను కలిపి పోస్ట్ చేస్తూ వారి వారి ఫ్యాన్స్ ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఆయా పోస్ట్ లతో సోషల్ మీడియా లో ఈ విషయం ట్రెండింగ్ గా నిలుస్తుంది.

Exit mobile version