Site icon Prime9

Pawan Kalyan : “బ్రో” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పీచ్ తో అదరగొట్టిన పవన్ స్టార్.. వారికి చెంపపెట్టు అంటూ !

pawan kalyan full speech details in bro pre release event

pawan kalyan full speech details in bro pre release event

Pawan Kalyan : మెగా హీరోలు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో”. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుండగా.. తెలుగు నేటివిటీ, పవన్.. తేజు ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో కేతిక శర్మ.. సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 28న రిలీజ్ కి రెడీ అయిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిన్న గ్రాండ్ గా నిర్వహించారు.

హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్..తో పాటు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ మేరకు ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఈ సినిమా సమయంలో తాను సముద్రఖనికి అభిమానిగా మారిపోయానని చెప్పారు. తెలుగువారిగా ఉన్న మనకు తెలుగు భాష మాట్లాడటం సరిగ్గా రాదని, మధ్యలో నాలుగైదు ఇంగ్లీష్ పదాలు వస్తాయని, మనం మాట్లాడేదంతా టింగ్లీష్ అన్నారు. కానీ సముద్రఖని తమిళుడని, మన భాష కాదు.. తెలుగువాడు కాదు.. కానీ ఓసారి ఆయన తెలుగు స్క్రిప్ట్ చదువుతుంటే తాను ఆశ్చర్యపోయానన్నారు. ఒక తమిళ దర్శకుడు తెలుగు స్క్రిప్ట్ చదవడం చూసి కలేమో అనుకున్నానని, ఆ తర్వాత ఆయననే అడిగానని, తెలుగు వస్తుందా? అని అడిగితే.. ఏడాదిగా నేర్చుకుంటున్నట్లు చెప్పారు. అందుకే నేను సముద్రఖనికి హామీ ఇస్తున్నానని ఓ రోజు తమిళం నేర్చుకొని, తమిళంలో ప్రసంగిస్తానని, తిరుక్కురల్ చెబుతానని అన్నారు. ఆయన తెలుగు భాష తనకు, తనలాంటి వారికి చెంపపెట్టు అన్నారు. తెలుగు భాషను పట్టించుకోని మాలాంటి వారందరికీ సముద్రఖని కనువిప్పు కలిగించారన్నారు. ఇందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

Image

తాను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లా అద్భుతంగా డ్యాన్స్ చేయలేకపోవచ్చునని, ప్రభాస్, రానాల వలె ఏళ్లకొద్ది కష్టపడి పని చేయకపోవచ్చునని, కానీ తనకు సినిమాలు అంటే ఇష్టమన్నారు. ఈ సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదీ కాదని, మా కుటుంబానిదీ కాదని, అందరిదీ అన్నారు. తనకు ప్రతి నటుడు అంటే ఇష్టమని, ఎందుకంటే అందరం గొడ్డు చాకిరి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు ఏదైనా బలంగా అనుకుంటే సాధించవచ్చునని అభిమానులకు సూచించారు. రాజకీయమైనా.. సినిమా అయినా.. చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. తమ కుటుంబం దిగువ మధ్యతరగతి కుటుంబమని, తన అన్నయ్య చిరంజీవి మెగాస్టార్ డమ్ సాధించాక హీరో అవ్వాలని అనుకోలేదని, చిన్న ఉద్యోగం, రైతులా చిన్న జీవితం గడపాలని భావించానని చెప్పారు. అయినా చిరంజీవి, కృష్ణ, ఎన్టీఆర్, నాగేశ్వరరావు ఉన్నారని చెప్పారు.

కానీ చిన్న జీవితం గడపాలనుకున్న నా మనసుకు మా వదిన బ్రేక్ వేశారని, ఆ రోజు మా వదిన చేసిన తప్పు ఇప్పుడు నన్ను ఇలా నిలబెట్టిందన్నారు. లేదంటే చిన్న జీవితం గడిపేవాడినని చెప్పారు. తాను చిరంజీవి తమ్ముడ్ని అయినప్పటికీ మొరటు మనిషిని అని, తనలో రైతు ఉన్నాడన్నారు. నాకు తెలిసింది త్రికరణశుద్ధిగా పని చేయడమన్నారు.

Exit mobile version