Site icon Prime9

OTT: ఓటీటీలో గాడ్ ఫాదర్, ది గోస్ట్ చిత్రాల సందడి

OTT releases god father and the ghost

OTT releases god father and the ghost

OTT: ఆరుపదుల వయస్సులోనూ వన్నెతరగని అందం, నటనతో యంగ్ హీరోలకు ధీటుగా టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి మరియు మన్మథుడు నాగార్జున. వీరిరువురు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇటీవల దసరా రేసులో వీరిద్దరి సినిమాలు అయిన గాడ్ ఫాదర్ మరియు ‘ది ఘోస్ట్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలను నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాలు తాజాగా ఓటీటీ వేదికగానూ అలరించనున్నాయి.

దసరా కానుకగా రిలీజై ది గోస్ట్ మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇంక గాడ్ ఫాదర్ అయితే భారీగానే కలెక్షన్ల రాబట్టింది. ఈ రెండు సినిమాలు విడుదలై దాదాపు 8 వారాలు గడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్‌ అవుతాయాని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాగా తాజాగా ది గోస్ట్ చిత్రం మంగళవారం అనగా నవంబర్ 1వ తేదీ రాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో నాగార్జున ఇంటర్‌పోల్‌ అధికారిగా నటించాడు. నాగార్జునకు జోడీగా సోనాల్‌ చౌహన్‌ నటించింది.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రానికి ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నవంబర్ 19వ తేదీ నుంచి ఈ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకులందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన ఇంతవరకూ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదీ చదవండి: “కడలి” హీరోతో.. “నాగచైతన్య” హీరోయిన్ పెళ్లి

Exit mobile version