Site icon Prime9

Swathi Muthyam: ‘స్వాతిముత్యం’ స్ట్రీమింగ్ డేట్ కన్ ఫర్మ్

'Swathimutyam'

'Swathimutyam'

Tollywood: ఈ సంవత్సరం దసరాకు విడుదలయిన చిత్రాలలో స్వాతిముత్యం చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఇది నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ కుమారుడు గణేష్ బెల్లంకొండ తొలిచిత్రం. భిన్నమైన కధాంశంతో వచ్చిన ఈ చిత్రానికి వసూళ్లు కూడ బాగానే ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం ‘స్వాతిముత్యం’ చిత్రం అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటుంది. అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు వారాల వ్యవధిలో OTT ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన బాలమురళీ కృష్ణగా గణేష్ నటించాడు. ఈ చిత్రం స్పెర్మ్ డొనేషన్ కాన్సెప్ట్‌పై రూపొందించినా వినోదాత్మక అంశాలు కూడ జతచేయబడ్డాయి. స్వాతిముత్యం’ చిత్రానికి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆహా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

Exit mobile version