Site icon Prime9

Sitaramam: సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజవుతున్న ’సీతారామం‘

Sitaramam-OTT

Sitaramam OTT: దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా ఆగష్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. గత శుక్రవారం, ఈ చిత్రం హిందీలోకి డబ్ చేయబడి అక్కడకూడ మంచి విజయం సాధించింది.

ఇప్పుడు, ఈ చిత్రం యొక్క ప్రాంతీయ వెర్షన్లు సెప్టెంబర్ 9వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో ఒక నెల దాటినప్పటికీ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. థియేట్రికల్‌గా విడుదలైన నెల రోజుల తర్వాత చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ఒటిటిలో విడుదల చేస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Exit mobile version