Site icon Prime9

Unstopable 2 episode-3: బాలయ్యపై శర్వానంద్ నాటీ కామెంట్స్.. తన క్రష్ తో నటసింహం వీడియో కాల్

unstoppable season 2 episode 3 promo

unstoppable season 2 episode 3 promo

Unstopable 2 episode-3: నటసింహం నందమూరి బాలకృష్ణ ఆహా వేదికగా హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంతగా క్లిక్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటి సీజన్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బాలయ్య. ఈ నేపథ్యంలోనే రెండో సీజన్ మొదటి ఎపిసోడ్‌లో చంద్రబాబు, లోకేష్‌లు.. రెండో ఎపిసోడ్‌లో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ వంటి మాస్ హీరోలతో మాస్ కా గాడ్ సందడి చేశాడు. ఇక ఈ వారం జరిగే మూడో ఎపిసోడ్‌కు క్లాస్ హీరోలు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్ అయిన శర్వానంద్, అడివి శేష్‌లు గెస్టులుగా వచ్చారు. ఇంకేముంది వారితో బాలయ్య బాబు ఓ రేంజ్ ఆడుకున్నాడనుకోండి. బాలయ్యకు ఏ మాత్రం తీసిపోకుండా శర్వా, అడివిశేష్ లు కూడా ఆయనపై పంచ్ లు వేస్తూ సరదాసరదాగా సందడి చేశారు.

ఇకపోతే పోయిన వారంలో జరిగిన రెండో ఎపిసోడ్లో బాలయ్య మాటల్లో మాటగా తన క్రష్ రష్మిక అని చెప్పడంతో.. ఈ ఎపిసోడ్‌లో రష్మికకు వీడియో కాల్ చేసి మరీ బాలయ్యతో మాట్లాడించి ఆయన కోరికను తీర్చేశాడు శర్వానంద్. బాలయ్య నాటీ పనులను బయటకు లాగేందుకు శర్వా ప్రయత్నించాడు. మీరు వంద సినిమాలకు పైగా చేశారు కదా? అంటే పాతిక ముప్పై మంది హీరోయిన్లతో చేశారు కదా? అని బాలయ్యను ఇరికించే ప్రయత్నం చెయ్యగా దానికి ఏం చేశాడు రా? అని అడివి శేష్‌ నోరెళ్లబెట్టేశాడు. అదే యాక్టింగ్ చేశారు కదా? అని అడుగుతున్నా అంటూ శర్వానంద్ కవర్ చేసేస్తాడు. దానికి బాలయ్య ఏం తీసిపోకుండా ఇదే బీ, సీ సెంటర్ల తెలివితేటలు అంటూ కౌంటర్ వేశాడు. దానితో అక్కడున్న ఆడియన్స్ తో పాటు శర్వా, అడివి శేష్ పగలబడి నవ్వేస్తారు.

ఇలా ఎపిసోడ్ అంతా కూడా ఫన్నీగానే సాగింది. అలాగే శేష్, శర్వాల పెళ్లి మీద ప్రశ్నలు వేశాడు బాలయ్య. దానికి ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్లున్నారు.. ప్రభాస్, శర్వా వంటి వారు పెళ్లి చేసుకున్న తరువాత నేను చేసుకుందామని అనుకుంటున్నానని అడివి శేష్ సమాధానం చెప్తాడు. దానితో శర్వా రెస్పాండ్ అవుతూ నేను ప్రభాస్ పేరు చెప్పుకుని తప్పించుకుంటూ ఉంటే నువ్ నా పేరు చెప్పుకుంటున్నావా? అని శేష్ పరువుతీస్తాడు. ఇలా ఈ ఎపిసోడ్‌ ఎంతో సరదాగా సాగనుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది.

ఇదీ చదవండి: “హరోం హర” అంటూ పలకరించనున్న సుధీర్ బాబు

Exit mobile version