Site icon Prime9

Unstoppable show: బాలయ్య అన్‌స్టాపబుల్ షో గెస్ట్ గా మాజీ సీఎం

Balayya

Balayya

Unstoppable 2: అన్‌స్టాపబుల్ అనే టాక్ షో ద్వారా నందమూరి బాలకృష్ణ తన ఫన్నీ అండ్ లైవ్లీ యాటిట్యూడ్‌ని ఆవిష్కరించారు. మొదటి సీజన్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇపుడు దీని రెండవ సీజన్ కూడా ప్రారంభయింది.

అన్‌స్టాపబుల్ 2 సినిమా సినీ సెలబ్రిటీలకే కాదు పొలిటికల్ ఇంటర్వ్యూలకు కూడా వేదిక అవుతోంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌లో బాలకృష్ణ నారా చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్‌లను ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు, నాల్గవ ఎపిసోడ్ కోసం, మేకర్స్ మాజీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని, మరియు కాంగ్రెస్ నాయకుడు సురేష్ రెడ్డిని అతిథులుగా పిలిచారు.

ఈ ఎపిసోడ్ ఇటీవలే చిత్రీకరించబడింది. ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌కు నటి రాధికా శరత్‌కుమార్‌ కూడా హాజరయింది. రాధిక, ఈ అతిథుల మధ్య ఉన్న అనుబంధం తెలియాలంటే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే. బాలయ్యతో అతిధులు దిగిన సెల్ఫీని పంచుకుంటూ మేకర్స్ మరి ఇట్స్ ఎ ర్యాప్! నెక్స్ట్ ఎపిసోడ్ పవర్, పాలిటిక్స్, మూవీస్ ఇంకా మెమరీస్, అన్నీ కలగలిపి రాబోతుంది. చూస్తూ ఉండండి! అంటూ ట్వీట్ చేసారు. ఈ ఎపిసోడ్ విడుదల తేదీ త్వరలో వెలువడనుంది.

Exit mobile version