Site icon Prime9

Tiger Nageswararao : మాస్ మహరాజ్ “టైగర్ నాగేశ్వరరావు” కి జోడీగా ఈ భామే.. “నుపూర్ సనన్” పిక్ వైరల్

nupur sanon poster released from raviteja Tiger Nageswararao movie

nupur sanon poster released from raviteja Tiger Nageswararao movie

Tiger Nageswararao : మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన అభిషేక్ అగర్వాల్ నిర్మాణంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతుతుంది. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

చాలాకాలం తరువాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్న రేణూదేశాయ్ ఈ సినిమాలో ఒక బలమైన పాత్రలో నటిస్తుంది. తమిళ్ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ఈ చిత్రానికి (Tiger Nageswararao) మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ యూనిట్.. షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్ తో పాటు ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. 90 వ దశకంలో స్టూవర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు రవితేజ కనిపించనంత రా అండ్ రస్టిక్ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు.

 

 

ఇటీవల ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. దసరా కానుకగా అక్టోబర్ 20న గ్రాండ్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే అందులో హీరోయిన్లను పెద్దగా చూపించలేదు. కాగా ఈ క్రమంలోనే తాజాగా ప్రమోషన్ లలో జోరు పెంచుతూ హీరోయిన్స్ కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నుపూర్ సనన్ పోస్టర్ ని.. ఆమె సోదరి, నేషనల్ అవార్డ్ విన్నర్ కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఈ సినిమాలో ఆమె సారా పత్రలో కనిపించనున్నట్లు పోస్టర్ చూస్తే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

 

Exit mobile version