Site icon Prime9

Oscars95: 95వ ఆస్కార్ వేడుకలు.. అదిరిపోయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్

oscars

oscars

Oscars95: ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినితారలు హాజరయ్యారు.

అదిరిపోయిన లుక్..

ఆస్కార్ వేడుకకు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ అస్కార్ వేడుకలో వారిద్దరి లుక్ అదిరిపోయింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఫైనల్స్ నామినేషన్ లో పోటీ పడుతోంది. ఎన్టీఆర్ ఎడమవైపు భుజంపై పులి బొమ్మ ఉన్న డ్రెస్ ధరించగా… రామ్ చరణ్ ఎడమవైపు ఛాతీపై ప్రత్యేక డిజైన్ కలిగిన డ్రెస్ వేసుకున్నారు. ఈ ఆస్కార్ వేడుకల్లో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ ఆస్కార్ వేడుకలకు వేదికైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు, యాంకర్ జిమ్మీ కిమ్మెల్ ఈ వేడుకలకు హోస్ట్ గా చేస్తున్నాడు. హాలీవుడ్ మాత్రమే కాక దేశ విదేశాల సినీ పరిశ్రమల నుంచి ఎంతోమంది గొప్ప గొప్ప నటులు, నటీమణులు, టెక్నీషియన్స్ ఆస్కార్ వేడుకలకు విచ్చేస్తున్నారు.

ఇక మరికొంత మంది ఆర్ఆర్ఆర్ సినిమా బృందం ఈ వేడుకకు హాజరైంది. రాజమౌళి, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. లతో పాటు ఉపాసన, రాజమౌళి తనయుడు కార్తికేయ.. మరికొంతమంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారు

 

 

Exit mobile version