Site icon Prime9

Extra Ordinary Man : ప్రభాస్ “సలార్” ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మార్చిన నితిన్ “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్”

nithin Extra Ordinary Man movie new release date announced

nithin Extra Ordinary Man movie new release date announced

Extra Ordinary Man : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. 2020లో ‘భీష్మ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో మళ్లీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ ని సాధించలేకపోయాడు. ‘భీష్మ’ తర్వాత వచ్చిన ‘రంగ్ దే’ యావరేజ్ గా నిలవగా, గత ఏడాది విడుదలైన ‘మాచర్ల నియోజకవర్గం’ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈయన ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” అనే సినిమా చేస్తున్నారు.

అయితే ఈ సినిమాను మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23 న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ అదే సమయానికి ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ విడుదల కబోతున్నట్లు ప్రకటించారు. ఈ ఎఫెక్ట్ తో చాలా సినిమాల రిలీజ్ డేట్స్ లో మారుతున్నాయి. టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్ ని మార్చుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ లిస్ట్ లోకి నితిన్ మూవీ కూడా చెరినట్లు తెలుస్తుంది.

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. మూవీని అదే నెలలో కాస్త ముందుగానే విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. ఈ మేరకు తాజాగా కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నితిన్ మరోసారి డిఫరెంట్ లుక్ తో ఆకట్టుకున్నారు.  కాగా ఇదే డిసెంబర్ 8వ తేదీన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ కూడా విడుదలవుతోంది. మరి ఈ పోటీలో ఎవరు నెగ్గుతారో చూడాలి. ప్రస్తుతం ఈ పోస్టర్ ట్రెండింగ్ గా మారింది.

కాగా ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ‘నా పేరు సూర్య’ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న వక్కంతం వంశీ లాంగ్ గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. రైటర్ గా చాలా హిట్లు అందుకున్న వక్కంతం వంశీ దర్శకుడిగా మొదటి సినిమాతో అపజయం అందుకున్నారు. దాంతో ఈసారైనా దర్శకుడిగా నితిన్ తో హిట్ కొడతాడేమో చూడాలి.

Exit mobile version