Site icon Prime9

Project K : ఊహించని అప్డేట్ తో సర్ ప్రైజ్ ఇచ్చిన “ప్రాజెక్ట్ K” టీమ్.. డబుల్ బొనాంజాతో ఫుల్ జోష్ లో రెబల్ స్టార్ ఫ్యాన్స్ !

new update from prabhas project k movie

new update from prabhas project k movie

Project K : రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ  బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై  గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా “ప్రాజెక్ట్ K”. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం నటిస్తుండడం విశేషం అని చెప్పాలి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ అంచనాలని మరింత రెట్టింపు చేస్తూ బుధవారం రాత్రి ఒక అప్డేట్ ఇచ్చింది. కాగా నిన్న ఉదయాన్నే ప్రభాస్ చేస్తున్న మరో చిత్రం “సలార్: టీజర్ రిలీజ్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేశారు. ఇక ఈ అప్డేట్ కూడా రావడంతో  డబుల్ బొనాంజా వచ్చిందంటూ హద్దులు లేని ఆనందంతో హడావిడి చేసేస్తున్నారు. ఇక చిత్రయూనిట్ అప్డేట్ ప్రకారం.. ప్రాజెక్ట్ K సినిమా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నట్టు ప్రకటించింది. అమెరికా కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో జరిగే ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నఅనేక మంది మూవీ లవర్స్, కామిక్ బుక్స్ అభిమానులు ఈ ఈవెంట్ కి విచ్చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా నాలుగు లేదా అయిదు రోజుల పాటు నిర్వహిస్తారు.

ఈ సంవత్సరం జులై 19 రాత్రి పార్టీతో ఈ ఈవెంట్ మొదలవుతుంది. జులై 23 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ లో పాల్గొనటానికి లక్షకు పైగా ఆడియన్స్ రానున్నారు. జులై 20న ఈ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంతో పాటు ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ పాల్గొననున్నారని సమాచారం అందుతుంది. అలానే ఈ సినిమా (Project K) గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు. దీంతో కామిక్ కాన్ లో పాల్గొనబోయే మొదటి ఇండియన్ సినిమాగా  ప్రభాస్ ప్రాజెక్ట్ K నిలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

 

 

కాగా ‘కామిక్ కాన్’ ఈవెంట్ ..  1970లో అమెరికా కాలిఫోర్నియా లోని శాన్ డియాగోలో ప్రారంభించారు. ఈ ఈవెంట్ లో ముఖ్యంగా కామిక్ బుక్స్ ని, సినిమాలను కామిక్స్ లాగా ప్రదర్శిస్తారు. అలాగే కామిక్ బుక్స్, సినిమా వాళ్ళు తమ సినిమాలని ప్రమోట్ చేసుకుంటారు. ఈ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్స్, అవార్డ్స్, మ్యూజియం, కామిక్ క్యారెక్టర్స్ లా విచిత్ర వేషధారణలు, ఎగ్జిబిషన్.. ఇలా చాలా ఉంటాయి. కామిక్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, కామిక్స్ ని ఇష్టపడేవాళ్ళకి మధ్యలో ఇది ఒక మీడియంలా పనిచేస్తుంది అని చెబుతుంటారు.

Exit mobile version