Site icon Prime9

Bro Movie : పవన్, సాయి తేజ్ “బ్రో” మూవీ లేటెస్ట్ అప్డేట్.. వింటేజ్ పవర్ స్టార్ బ్యాక్ అంటున్న ఫ్యాన్స్

new poster released from pavan kalyan and saitej bro movie

new poster released from pavan kalyan and saitej bro movie

Bro Movie : ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం “బ్రో” ( BRO Movie ). మామా అల్లుళ్ళు కలిసి మొదటిసారి ఒక సినిమా చేస్తుండడంతో ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ యాక్టర్ అండ్ డైరెక్టర్ సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. కాగా తమిళ హిట్ చిత్రం ‘వినోదయ సిత్తం’కి ఇది రీమేక్ గా వస్తుంది.  ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో కేతిక శర్మ.. సాయి ధరమ్ కి జోడిగా కనిపించబోతుందని తెలుస్తుంది. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ చెల్లి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ పై ఒక సాంగ్ బ్యాలన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని జులై 28న ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

ఇందులో పవన్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్యక్రమాలు జరుపుకుంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక మరోవైపు రిలీజ్ దగ్గర పడుతుండడంతో  మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే త్వరలోనే ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఇప్పుడు వీటిని నిజం చేస్తూ మూవీ డైరెక్టర్ తీశార రిలీజ్ గురించి త్వరలోనే అప్డేట్ రానుందని సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట ఫుల్ గా చక్కర్లు కొడుతుంది. ఈ పోస్టర్ లో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ లుంగీ కట్టుకొని స్టైల్ గా నిలబడ్డారు. ఇక ముఖ్యంగా పవన్ గెటప్ చూస్తే తమ్ముడు సినిమాలో వయ్యారి భామ సాంగ్ గెటప్ లా ఉండి అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ అంతా మరింత ఖుషి అవుతూ టీజర్ కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ని షేర్ చేస్తూ సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

 

 

Exit mobile version