Site icon Prime9

NBK 109 : బాలయ్య – బాబీ కాంబినేషన్.. NBK 109 మూవీ పూజా కార్యక్రమం షురూ

new poster released from nbk 109 about starting shooting

new poster released from nbk 109 about starting shooting

NBK 109 : నందమూరి నట సింహం.. బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ప్రస్తుతం అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ విజయాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. కాగా ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవల బాలయ్య బర్త్ డే సందర్భంగా గతంలో.. ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో ఒక కాన్సెప్ట్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో  గొడ్డలి, సుత్తి, కత్తి వంటి పలు మారణాయుధాలతో పాటు ‘వయలెన్స్ కి విజిటింగ్ కార్డు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక అలానే ఆ సూట్ కేసులో మ్యాన్షన్ హౌస్ మందు బాటి, సిగరెట్, డబ్బులు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన.. ‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో ఒక దానిలో బాలయ్య హీరో అయితే.. మెగాస్టార్ మూవీకి బాబీ దర్శకుడు. ఇప్పుడు అనూహ్యంగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం విశేషం అని చెప్పాలి. దాంతో బాలకృష్ణ మాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని బాబీ మంచి కథ రెడీ చేసి ఉంటారని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గకుండా బాబీ అభిమానులందరికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.

తాజాగా ఈ సినిమా (NBK 109) షూటింగ్ మొదలు పెట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. అందుకు గాను సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఆ ఫోటోలో గొడ్డలికి ఒక ఆంజనేయస్వామి బిళ్ళ ఉన్న దండ వేసి, దానికి కళ్ళజోడు పెట్టారు. ఆ కళ్ళజోడులో అవతల జరిగే పోరాట సన్నివేశాలు చూపిస్తున్నట్టు ఉండేలా పోస్టర్ ని డిజైన్ చేశారు. ఈ పోస్టర్ లో బ్లడ్ బాత్ కి బ్రాండ్ నేమ్, వైలెన్స్ కి విజిటింగ్ కార్డు అని బాలకృష్ణ గురించి రాసుకొచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ 109వ సినిమా కానుంది.

Exit mobile version