Site icon Prime9

Nayanthara: నయనతార వర్సెస్‌ ధనుష్‌ – నెట్‌ఫ్లిక్స్‌ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు

Nayanthara Vs Dhanush: లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, హీరో ధనుష్‌ వివాదం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. నానుమ్‌ రౌడీ దాన్‌ మూవీలోని క్లిప్‌ని తన అనుమతి లేకుండ నయనతార బయోపిక్‌లో వాడటాన్ని ధనుష్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమైన కాపీ రైట్‌ కింద రూ.10కోట్ల దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై నయన్‌, ధనుష్‌లు కోర్టుకు ఎక్కారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. అయితే ధనుష్‌ వేసిన కాపీరైట్‌ దావాను కొట్టివేయాలని కోరుతూ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేసిన పిటిషన్‌ని తాజాగా మద్రాస్‌ హైకోర్టు తిరస్కరించింది.

నేడు నెట్‌ఫ్లిక్స్‌ పిటిషన్‌పై విచారించిన కోర్టు నటుడి అనుమతి లేకుండ సినిమా క్లిప్‌ వాడటాన్ని తప్పుబట్టింది. దీంతో నెట్‌ అభ్యర్థనను కొట్టిపారేసింది. నయనతార బయోపిక్‌పై మధ్యతర నిషేధం విధించాలన్న ధనుష్‌ పిటిషన్‌ను ఫిబ్రవరి 5న విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. కాగా నయనతార జీవితకథను నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‌ (Nayanthara: Beyond the Fairytale) అనే డాక్యుమెంటరీ తెరకెక్కించింది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార హీరోహీరోయిన్లుగా విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నానుమ్‌ రౌడీదాన్‌’ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్‌ని వాడారు.

విఘ్నేష్‌,నయన్‌ కలుసుకుంది ఈ సినిమాతోనే. దీంతో తన జీవితంలో ప్రత్యేకత స్థానం ఉన్న ఈ సినిమాలో క్లిప్‌ వాడుకున్నట్టు నయన్ తెలిపింది. అయితే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు ధనుష్‌. దీంతో ఈ సినిమాలోని క్లిప్‌ని తన అనుమతి లేకుండ వాడటాన్ని వ్యతిరేకించాడు. 24 గంటల్లో ఆ క్లిప్‌ని డాక్యుమెంటరీ నుంచి తొలగించాలని లేదంటే రూ. 10కోట్లు జరిమానా విధిస్తాననంటూ నోటీసులు ఇచ్చాడు. ఆయన హెచ్చరికలను నయనతార, నెట్‌ఫ్లిక్స్‌ ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో ధనుస్‌ మద్రాస్‌ హైకోర్టు ఆశ్రయించాడు.

Exit mobile version