RRR Movie : తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతూ.. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా “ఆర్ఆర్ఆర్”. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం భారత్ లోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ సినిమాకి బ్రహ్మరధం పడుతున్నారు. అలానే ఇప్పటి వరకు ఈ సినిమా పలు అంతర్జాతీయ అవార్డులను కైవసం చేసుకొని మార్చి 12 న జరగబోయే ఆస్కార్ అవార్డుల రేసులో కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతుంది. కాగా ఇటువంటి తరుణంలో తెలుగువారిగా మనమంతా గర్వించవలసిన సమయంలో మనవారే మన సినిమాపై కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఘాటుగా స్పందించిన మెగా బ్రదర్ నాగబాబు (RRR Movie)..
కాగా తాజాగా తమ్మారెడ్డి వ్యాఖ్యాల పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తమ్మారెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆ పోస్ట్ లో.. టు హోమ్ ఎవర్ ఇట్ మే కన్సర్న్ “నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు RRR కి ఆస్కార్ కోసం” ( #RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం) అంటూ ఘాటుగా రెస్పాండ్ అయ్యారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ కామెంట్‌ను ఎవరికి కావాలంటే వారు అన్వయించుకోవచ్చని నోట్ కూడా పెట్టారు. నాగబాబు ట్వీట్‌కు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికుల నుంచి అదిరిపోయే స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో నాగబాబు ట్వీట్ వైరల్ అవుతోంది.
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం”
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023
జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ డబ్బు తీసుకొని మన సినిమాని పొగుడుతారా – రాఘవేంద్రరావు
అదే విధంగా తమ్మారెడ్డి భరద్వాజకు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా తనదైన రీతిలో చురకలు అంటించారు. ఈ మేరకు గురువారం రాత్రి ఆయన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు. అందులో ‘మిత్రుడు భరద్వాజ్‌కి.. తెలుగు సినిమాకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకుడికి, తెలుగు నటులకి ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరుని చూసి గర్వపడాలి. అంతే కానీ 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా..? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అంటూ తమ్మారెడ్డిని సూటిగా ప్రశ్నించారు రాఘవేంద్రరావు. మరి వీరి కామెంట్స్ పై తమ్మారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
— Raghavendra Rao K (@Ragavendraraoba) March 9, 2023
ఇంతకీ తమ్మారెడ్డి ఏమన్నారంటే (RRR Movie)..?
హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ సినిమా బడ్జెట్ల గురించి విమర్శలు చేశారు. దీనిలో భాగంగా ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల ప్రస్తావన తీసుకొచ్చారు. బాహుబలి విషయంలో రాజమౌళిని గొప్పోడని చెప్పాలి అంటూ నవ్వుతూ అన్నారు. ఇదే క్రమంలో RRR సినిమాకి వచ్చే ఆస్కార్ కోసం రూ.80 కోట్లు పెట్టారని.. ఆ రూ.80 కోట్లు తనకు ఇస్తే 8 సినిమాలు తీసి వాళ్ల మొఖాన కొడతామంటూ మాట్లాడారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/