Site icon Prime9

Naatu Naatu: ‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్.. ప్రముఖుల స్పందన ఇదే!

RRR movie short listed for Oscar Awards

RRR movie short listed for Oscar Awards

Naatu Naatu: ఆస్కార్ అవార్డుల్లో నాటు నాటు సాంగ్ అదరగొట్టింది. ఈ పాట సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అవార్డుతో ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. ప్రపంచ సినిమాలోనే అత్యున్నత పురస్కారం.. తెలుగు సినీ పాటకు తలొంచింది. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు అవార్డు రావడంపై ప్రముఖులు స్పందించారు.

అభినందనలు తెలిపిన ప్రముఖులు.. (Naatu Naatu)

ఆస్కార్ అవార్డుతో ఎన్నో ఏళ్ళ కల నెరవేరింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులు ఈ సినిమా చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

భారతీయులు గర్వపడేలా చేశారు- చిరంజీవి

నాటు నాటు సాంగ్ కి అవార్డు రావడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పాటలో చరణ్ భాగస్వామి కావడం.. చాలా సంతోషంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ ను ఆస్కార్ వరకు తీసుకువెళ్లిన ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. చిత్ర బృందానికి మెుత్తం ప్రశంసలు దక్కాలని చిరంజీవి అన్నారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన చంద్రబోస్.. సంగీతం అందించిన కీరవాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

దేశాన్ని గర్వపడేలా చేసింది- కీరవాణి

ఎంఎం కీరవాణి ఆస్కార్ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమా దేశాన్ని గర్వపడేలా చేసిందని ఆయన అన్నారు. ఈ పాట తనని ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని పేర్కొన్నారు. ఈ అవార్డు రావడం ఎంతో సంతోషంగా ఉందని రచయిత చంద్రబోస్ అన్నారు. ఈ మేరకు ఆయన అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవటం అభినందనీయమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మేరకు చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. https://twitter.com/MVenkaiahNaidu/status/1635115582550065155?s=20

చరిత్ర సృష్టించిన నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అకాడమీ అవార్డును గెలుచుకోవడం ద్వారా ‘నాటు నాటు’ చరిత్రలో తన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది బహుశా భారతీయ సినిమాకి అత్యుత్తమ ఘట్టం మరియు తెలుగువారు దీనిని సాధించడం మరింత ప్రత్యేకం. అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

భారతీయులు గర్విస్తున్న క్షణాలివి- పవన్ కళ్యాణ్

ఆస్కార్ అవార్డుతో భారతీయులు గర్వపడుతున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు పాట రచయిత చంద్రబోస్.. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ గీతాన్ని ఆస్కార్ వేదికగా ప్రదర్శించడంతో పాటు.. అవార్డు పొందడం ద్వారా భారతీయ సినిమా స్తాయి ప్రపంచ స్థాయికి చేరిందని కొనియాడారు.

బెస్ట్ ఒరిజినల్ కెటగిరీలో ఆస్కార్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి తెలంగాణ గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బృందం భారతీయులను తెలుగు సినిమాను గర్వించే స్థాయికి తీసుకువెళ్లారని ట్వీట్టర్ వేదికగా ప్రశంసించారు.

సూపర్ లిరిక్స్..

ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నాటు నాటు పాటకు రచయిత చంద్రబోస్ అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించగా.. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. ఈ పాటకు సంగీతం మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ డ్యాన్స్ తో దుమ్మురేపారు.

ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు. ఇక భారతీయ చిత్రం ఆస్కార్ వేడుకల్లో మెరిసింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. ఈ వేడుకలో కార్తీకి ఆస్కార్ ను సగర్వంగా అందుకున్నారు. షార్ట్ ఫిలిమ్ విభాగంలో భారత్ కు ఇదే తొలి ఆస్కార్ కావడం విశేషం.

వీరే కాకుండా.. వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు సైతం.. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు.

Exit mobile version