Site icon Prime9

Adipurush Movie : ఆదిపురుష్ చూసేందుకు వచ్చిన హనుమ.. ఆ మాట నిజం అయ్యింది !

monkey watching prabhas adipurush movie in hyderabad

monkey watching prabhas adipurush movie in hyderabad

Adipurush Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా.. రామాయణం కథాంశంతో వస్తున్న మూవీ “ఆదిపురుష్”. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తుండగా.. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంయుక్తంగా ఈ సినిమాని 600 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాగా ఈ సినిమాని తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిసిందే. కాగా రామాయణ కథాంశంతో ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ చిత్రం.

ఇక ఈ మూవీ ప్రదర్శించే ప్రతి థియేటర్ లో ఒక సీట్ హనుమంతుడు కోసం కేటాయించాలి అంటూ దర్శకుడు ఓం రౌత్ నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్స్ ని కోరిన సంగతి తెలిసిందే. ఎందుకంటే మన గ్రంధాలలో కావొచ్చు, పూర్వీకులు చెప్పే మాటలు కావొచ్చు.. “రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు” అనే మాటని చెబుతూ ఉంటారు. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రతి థియేటర్ లో ఇప్పటికే హనుమంతుడు కోసం ఒక సీట్ ప్రత్యేకంగా కేటాయించారు. అయితే ఈరోజు ఈ మాట మరోసారి నిజం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అందరూ ఒకింత షాక్ అవుతున్నప్పటికీ.. మరోవైపు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు.

అసలు ఏం జరిగిందంటే.. ఆదిపురుష్ సినిమా ప్రదర్శితం అవుతున్న ఒక థియేటర్ లో కోతి ప్రత్యక్షమయ్యింది. థియేటర్ విండోలో నుంచి వచ్చిన ఆ కోతి ఆదిపురుష్ సినిమాని చూస్తుంటే ఒక అభిమాని వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్ అవ్వగా ఆదిపురుష్ మూవీ టీం కూడా ఆ వీడియోని రీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

 

 

Exit mobile version