Site icon Prime9

Mohan Babu: మనోజ్‌ని నా ఇంటి నుంచి పంపించి.. ఆస్తులు అప్పగించండి – జిల్లా మెజిస్ట్రేట్‌లో మోహన్‌ బాబు ఫిర్యాదు

Mohan Babu Complaint Against Manchu Manoj: మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. మంచు మనోజ్ తిరుపతి వెళ్లడంతో అక్కడ వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే తాజాగా మనోజ్‌కు షాక్‌ ఇచ్చాడు మోహన్‌ బాబు. తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని, వారిని ఖాళీ చేసి తన ఆస్తులు తనకు అప్పగించాలంటూ మోహన్‌ బాబు శనివారం జిల్లా మేజిస్ట్రేట్‌ కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొననారు.

మోహన్‌ బాబు ఫిర్యాదు మేరకు రంగరెడ్డి జిల్లా కలెక్టర్ మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలో ఆస్తి వివాదాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో శంషాబాద్ సమీపంలో జల్‌పల్లి మోహన్‌ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచు విష్ణు, మోహన్‌ బాబు అనుచరులతో మంచు మనోజ్‌ అనుచరుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత వివాదం సద్దుమణిగినట్టు కనిపించింది.

ప్రస్తుతం మోహన్‌ బాబు, విష్ణులు తిరుపతిలో ఉంటున్నారు. మనోజ్ మాత్రం తన భార్య మౌనిక రెడ్డి, పిల్లలతో కలిసి జల్‌పల్లిలోని ఇంట్లోనే నివాసముంటున్నాడు. దీంతో మోహన్‌ బాబు తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారంటూ మనోజ్‌పై ఆరోపణలు చేశాడు. సీనియర్ సిటిజన్‌ యాక్ట్‌ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్‌ బాబు జిల్లా మేజిస్ట్రేట్‌ని కోరారు. దీంతో రంగారెడ్డి జిల్లా పోలీసులు పోలీసుల నుంచి మోహన్ బాబు ఆస్తులకు సంబంధించిన నివేధిక తీసుకున్నారు. అనంతరం జల్‌పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈ విషయమై మనోజ్‌ తాజాగా కలెక్టర్‌ని కలిసి వివరణ ఇచ్చాడు.

తన కుటుంబంలో జరుగుతున్న గొడవలు, పరిణామాణాలపై కలెక్టర్‌తో చర్చించినట్టు సమాచారం. తన తండ్రి ఫిర్యాదుతో మనోజ్ కాసేపటి క్రితం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు వెళ్లాడు. అదనపు కలెక్టర్‌ ప్రతిమా సింగ్‌ను కలిసి నోటీసులపై వివరణ ఇచ్చాడు. తాను అక్రమంగా ఆ ఇంటిలో ఉండటం లేదని, తమకు ఆస్తి తగాదాలు ఏమి లేవని స్పష్టం చేసినట్టు సమాచారం. తన సోదరుడు విష్ణు తన తండ్రి మోహన్‌ బాబుని అడ్డం పెట్టుకుని నాటకాలాడుతున్నాడని ఆరోపించాడు. న్యాయం జరిగేవరకు తన పోరాటం ఆగదని కలెక్టర్‌తో చెప్పినట్టు సమాచారం.

Exit mobile version