Site icon Prime9

Manchu Mohan Babu: మనోజ్ పై మరోసారి మోహన్ బాబు ఫిర్యాదు – కొడుకుపై కఠిన చర్యలు తీసుకోవాలని అప్పీలు!

Mohan Babu Complaint on Son Manoj: కొడుకు మంచు మనోజ్ పై సినీ నటుడు మోహన్ బాబు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాడని, వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రిక ప్రకటన ఇచ్చారు. లేఖలో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘సంక్రాంతి పండుగ సందర్భంగా మంచు మనోజ్ నారావారి పల్లేలోని తన మేనత్త మేడసాని విజయమ్మ గారి ఇంటికి వస్తానంటూ ఆమెకు కబురు పంపాడు.

అయితే ఆమె రావద్దని చెప్పింది. తండ్రి మాట వినడం లేదని, అన్నయ్య గొడవపడుతూ ఇంటి పరువు తీస్తున్నావు. కాబట్టి తన ఇంటికి రావద్దని ఆమె తెలిపింది. అయినా వినకుండ మనసులో ఏదో దురుద్దేశంతో నారావారి పల్లేకు వెళ్లాడు. అక్కడ మంత్రి నారా లోకేష్ ని కలిశాడు. ఆయన ఒక నిమిషం మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత నారా రోహిత్ తో కలిసి కాసేపు ముచ్చటించాడు. భైరవం సినిమాలో ఇద్దరు నటిస్తున్న క్రమంలో కాసేపు సినిమా గురించి మాట్లాడి తిరిగి వచ్చేసాడు.

తిరుగు ప్రయాణంలో మా విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీలోకి బలవంతంగా వెళ్లాలని చూశాడు. దాదాపు 200 మందితో కలిసిలోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు వద్దని ఎంత హెచ్చరించిన వినలేదు. ఇప్పటికే కోర్టు మనోజ్ విద్య సంస్థల ప్రాంగణలోని వెళ్లకూడదని ఆదేశించింది. దీనిపై పోలీసులు కూడా అతడిని హెచ్చరించారు. దీంతో కొంత వెనక్కి వెళ్లిన మనోజ్ మోహన్ బాబు విద్యాసంస్థలోని డైయిరీ ఫారంలోని గేటుపై నుంచి దూకి లోపలికు ప్రవేశించాడు. ఇది కచ్చింతంగా కోర్టు ధిక్కారణే అవుతుంది. కాబట్టి వెంటనే అతడిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగ పాలీసులకు, కోర్టుకు అప్సీలు చేస్తున్నాను’ అని ఆయన లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version