Site icon Prime9

MM Keervani : ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఇంట తీవ్ర విషాదం..!

mm keervani mother passed away due to health issues

mm keervani mother passed away due to health issues

MM Keervani : ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు కీరవాణి. ఎన్ని సినిమాలకు తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసిన కీరవాణి ఎంతో మంది హృదయాలను దోచుకున్నారు. రాజమౌళి సినిమాలకు సగ బలం ఏంటంటే… ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ సమకూర్చే కథ, కీరవాణి అందించే సంగీతం అని చెప్తారు. ఇక ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు పొందారు. అయితే తాజాగా కీరవాణి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అని తెలుస్తుంది.

కీరవాణి తల్లి భానుమతి అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. గతకొద్ది రోజులుగా ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా, మూడు రోజుల క్రితమే ఆమెను కిమ్స్ ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూసినట్లుగా కిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె మృతితో కీరవాణి, రాజమౌళి కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా మరికాసేపట్లో భానుమతి భౌతికకాయాన్ని డైరెక్టర్ రాజమౌళి నివాసానికి తరలించనున్నారని సమాచారం అందుతుంది. తల్లి మృతితో కీరవాణి తీవ్ర దు:ఖంలో మునిగిపోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సినీ ప్రముఖులు కీరవాణికి తమ సంతాపం తెలుపుతున్నారు. ఆమె అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

ఆర్ఆర్ఆర్ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుని, పలు అవార్డులు రివార్డులు అందుకుంటున్న రాజమౌళి, కీరవాణి కుటుంబాల్లో భానుమతి మరణవార్త తీవ్ర విషాదం నింపిందని చెప్పాలి. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో 2022 కు గాను ఎమ్ ఎమ్ కీరవాణి విన్నర్ గా నిలిచాడు. అలానే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ కి కూడా ‘బెస్ట్ పిక్చర్ – నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ లో నిలిచింది.

Exit mobile version