Site icon Prime9

Megastar Chiranjeevi : అల్లు అర్జున్ ని కలిసి అభినందించిన మెగాస్టార్ చిరంజీవి..

megastar chiranjeevi meet and appreciates allu arjun

megastar chiranjeevi meet and appreciates allu arjun

Megastar Chiranjeevi : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప – 2 “.  2021 లో రిలీజ్ అయిన “పుష్ప” సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొట్టింది. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా పుష్ప-2 షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటుంది.

కాగా ఇటీవల ప్రకటించిన కతీయ అవార్డుల్లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంతో మెగా, అల్లు కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. దీంతో అల్లు అర్జున్ కి సినీ, రాజకీయ ప్రముఖులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్.. పలువురు హీరోలు విషెస్ చెప్పగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి… అల్లు అర్జున్ ను స్వయంగా అభినందించారు.

 

 

ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బన్నీకి స్వీట్ తినిపించి తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా చిరు పక్కన ఆయన భార్య, అల్లు అర్జున్ మేనత్త సురేఖ కూడా ఉన్నారు. అదే విధంగా అంతకు ముందు బన్నీకి జాతీయ అవార్డ్ రావడంపై చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా “బన్నీ విషయంలో తాను ఎంతో గర్వంగా ఉన్నట్లు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. చికా బాబాయ్ మీ నుంచి ఈ సందేశం రావడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు అవార్డు రావడంతో ముందుగా తన తండ్రి అల్లు అరవింద్ పాదాలకు నమస్కరించారు. ఆ తర్వాత తన భార్య, పిల్లలను ఆప్యాయంగా హత్తుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ వైరల్ గా మారాయి.

Exit mobile version