Megastar Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. భోళా శంకర్ తో నిరాశ పరిచిన చిరు.. నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినాటలు కనబడుతుంది. అందుకే తన నెక్స్ట్ మూవీని బింబిసారా మూవీ డైరెక్టర్ వశిష్ట తో చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కళ్యాణ్ కృష్ణ తో ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి వశిష్ట మూవీ ముందు పట్టాలెక్కుతుంది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మించబోతోంది.
సోషియో ఫాంటసీ నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కబోతుందని దర్శకుడు ఇప్పటికే తెలియజేశాడు. రీసెంట్ గానే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. పూజా కార్యక్రమంలో దర్శకుడు వశిష్ఠకు చిరంజీవి, సురేఖ దంపతులు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా… దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్, మారుతి సహా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ సినిమా టైటిల్, కాస్టింగ్ సెలక్షన్ పై నెట్టింట అనేక వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా టైటిల్ లీక్ అయ్యింది. స్క్రిప్ట్ పేపర్ కి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఏ టైటిల్ ఫిక్స్ చేశారంటే..
‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఇక ఈ టైటిల్ నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. చిరంజీవి వరుణ్ తేజ్ పెళ్లి హడావుడిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ హడావుడి పూర్తి అవ్వగానే చిరు కూడా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో విలన్ గా రానా నటించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి ఆ వార్త ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
#MegastarChiranjeevi #Viswambhara @KChiruTweets pic.twitter.com/XPiGXw56jX
— Team Chiru Vijayawada (@SuryaKonidela) November 1, 2023
ఈ సినిమాకి స్పెషల్ గా ఓల్డ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసినట్లు కనబడుతుంది. ముందుగా సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది తెలుగు చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే… ఆ పద్ధతికి కొన్ని రోజులుగా బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 (Megastar Chiranjeevi) చిత్ర బృందం తీసుకురావడం గమనార్హం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ సమక్షంలో.. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. అలానే ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని.. పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్ళీ ఈ సినిమాతో తీసుకు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు.