Site icon Prime9

Mega Star Chiranjeevi : వరుణ్ – లావణ్య పెళ్లికి కారణం అదే అంటూ మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ పోస్ట్…

mega-star-chiranjeevi shares varun lavanya marriage pic

mega-star-chiranjeevi shares varun lavanya marriage pic

Mega Star Chiranjeevi : మెగా స్టార్ చిరంజీవి ఇంట్లో ప్రస్తుతం అన్నీ శుభకార్యాలు , సంబరాలు జరుగుతున్నాయి . తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ బ్యాచిలర్ లైఫ్‏కు ఫుల్ స్టాప్ పెట్టిన సంగతి తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఏడడుగులు వేశారు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో వీరిద్దరి వివాహం అంగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు మెగా, అల్లు కుటుంబసభ్యులతోపాటు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకలు దాదాపు మూడు రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగాయి . ఆ తర్వాత నవంబర్ 5న మాదాపూర్‏లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ నిర్వహించారు. ఇక మెగా ఇంట పెళ్లి వేడుక ముగియడంతో ఇప్పుడిప్పుడే మెగా హీరోలు తిరిగి షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రీకరణ కోసం మైసూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అటు వరుణ్ సైతం మట్కా మూవీ స్టార్ట్ చేశారు.

ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్ స్టా ఖాతాలో వరుణ్, లావణ్య పెళ్లికి సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. వీరిద్దరి హల్దీ వేడుకలో తన భార్య సురేఖతో కలిసి దిగిన ఫోటోలను వీడియోగా మార్చి షేర్ చేశారు. “ఇటలీలో ఒక అందమైన సాయంత్రం. ఇది చాలా కాలం క్రితం జరిగింది కాదు.. ప్రేమతో ఒకటైన రెండు హృదయాలు. ఎన్నో మధురమైన క్షణాలు, జ్ఞాపకాలను తీసుకొచ్చాయి. అలాంటి ఒక అందమైన క్షణాన్ని మీతో పంచుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం చిరు షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. 2017లో వరుణ్, లావణ్య కలిసి మిస్టర్ సినిమా చేశారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరు అంతరిక్షం సినిమా చేయగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ధ అలరించలేకపోయింది . దాదాపు ఆరేడేళ్లు వీరి ప్రేమ విషయాన్ని బయటపెట్టకుండా నిశ్చితార్థంతో అనౌన్స్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో వీరి ఎంగెజ్మెంట్ జరగ్గా.. నవంబర్ 1న వీరి వివాహం జరిగింది.చిరు సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే భోళా శంకర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరు తన కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు.

Exit mobile version