Site icon Prime9

 Mega Star 154 Film: సంక్రాంతి బరిలో బాస్… ప్రభాస్ విజయ్ లతో పోటీగా మెగాస్టార్..!

first-single-glimpse-from-chiranjeevi-waltair-veerayya

first-single-glimpse-from-chiranjeevi-waltair-veerayya

 Mega Star 154 Film: కుర్ర హీరోలకు పోటీగా చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బిజీ బిజీగా షూట్స్ చేస్తూ గ‌డుపుతున్నాడు. కాగా మెగాస్టార్ 154వ చిత్రం అయిన వాల్తేరు వీరయ్య సినిమా అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మరి అదేంటో చూసెయ్యండి.

హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చిరు సెట్స్ పై బిజీబిజీగా ఉన్నారు. అయితే ఇటీవలె ఆచార్య‌తో చిరు భారీ ఫ్లాప్‌ను అందుకున్నాడు. ఈ చిత్రం మెగా ఆభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. ఈ నేపథ్యంలో చిరు త‌న త‌దుప‌రి చిత్రాల‌పై పూర్తి కాన్సట్రేషన్ పెట్టాడు. ప్రస్తుతం మెగాస్టార్ నాలుగు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ‘వాల్తేరు వీర‌య్య’మూవీ ఒక‌టి. ఇందులో మెగాస్టార్ అండ‌ర్ క‌వ‌ర్ కాప్‌గా క‌నిపించ‌నున్నాడు. శృతిహాస‌న్ హీరోయిన్ న‌టిస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ కీల‌క‌పాత్ర పోషిస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందించబడుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా సంక్రాతి బరిలో నిలబడనుందని జ‌న‌వ‌రి 13న ఈ మూవీ విడుద‌ల చేసేలా మూవీ మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. దీనిపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న రానున్న‌ట్లు తెలుస్తుంది. కాగా అస‌లు ఈ వార్త‌లో నిజానిజాలు తెలియాలంటే మేక‌ర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

కాగా ఇప్ప‌టికే సంక్రాంతి రేసులో ప్ర‌భాస్ ‘ఆదిపురుష్’ చిత్రం రానున్నట్టు అధికారికంగా ప్ర‌కటన వెలువడగా.. విజ‌య్ ‘వార‌సుడు’ కూడా ఈ సంక్రాంతికి రానున్న‌ట్లు ప్ర‌చారం నడుస్తుంది. మ‌రీ రెండు సినిమాల పోటీని త‌ట్టుకుని బాస్ ఈజ్ బ్యాక్ అంటాడో లేదో చూడాలి.

ఇదీ చూడండి: Prabhas Adipurush: ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్ డేట్ ఫిక్స్..!

Exit mobile version