Site icon Prime9

Mega 156 : పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మెగాస్టార్ 156 మూవీ స్టార్ట్.. ఈసారి స్పెషల్ అదే !

Mega 156 movie started with pooja ceremony and photos got viral

Mega 156 movie started with pooja ceremony and photos got viral

Mega 156 :  మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు.  రీసెంట్ గానే భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఊహించని రీతిలో భారీ డిజాస్టర్ ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకి ఓకే చెప్పేశారు. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఇప్పుడు కళ్యాణ్ కృష్ణ తో ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి వశిష్ట మూవీ ముందు పట్టాలెక్కుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈరోజు ఉదయం ఈ చిత్ర పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.

యువి క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఈ రోజు సినిమా లాంఛనంగా మొదలైంది. పూజా కార్యక్రమంలో దర్శకుడు వశిష్ఠకు చిరంజీవి, సురేఖ దంపతులు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా… దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు క్లాప్ ఇచ్చారు. దర్శకులు వీవీ వినాయక్, మారుతి సహా చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

అయితే ఈ సినిమాకి స్పెషల్ గా ఓల్డ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసినట్లు కనబడుతుంది. ముందుగా సినిమాకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయడం అనేది తెలుగు చిత్రసీమలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అయితే… ఆ పద్ధతికి కొన్ని రోజులుగా బ్రేకులు పడ్డాయి. మళ్ళీ ఆ సంప్రదాయాన్ని మెగా 156 చిత్ర బృందం తీసుకురావడం గమనార్హం. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, దర్శకుడు వశిష్ఠ సమక్షంలో.. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. అలానే ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని..  పూజ తర్వాత సాంగ్స్ రికార్డ్ చేయడమనే పద్ధతిని మళ్ళీ ఈ సినిమాతో తీసుకు వస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందని సంగీత దర్శకుడు కీరవాణి తెలిపారు.

 

Exit mobile version