Site icon Prime9

Meenakshi Chaudhary : కోలీవుడ్ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి.. దళపతి విజయ్ 68 లో !

Meenakshi Chaudhary going to act in thalapathy vijay 68 movie

Meenakshi Chaudhary going to act in thalapathy vijay 68 movie

Meenakshi Chaudhary : టాలీవుడ్ కి “ఇచ్చట వాహనములు నిలుపరాదు” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది “మీనాక్షి చౌదరి”. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి, అడివి శేష్ హీరోగా వచ్చిన హిట్ 2 సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గానే విజయ్ ఆంటోనీతో కలిసి హత్య సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ అవుతున్న హీరోయిన్స్ లో ఈ భామ కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదని చెప్పాలి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న “గుంటూరు కారం” మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ వైపు అడుగులు వేస్తుంది.

ప్రస్తుతం సినీ వర్గాల్లో నడుస్తున్న టాక్ ప్రకారం మీనాక్షి చేతిలో మొత్తం మీద 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయని అంటున్నారు. వాటిలో విశ్వక్ సేన్, వరుణ్ తేజ్ సినిమాలు ఉండగా.. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించబోయే ‘లక్కీ భాస్కర్’లో కూడా హీరోయిన్ గా ఛాన్స్ అందుకొని మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది. కాగా ఇప్పటికే విజయ్ ఆంటోని హత్య సినిమాలతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన మీనాక్షీ (Meenakshi Chaudhary) త్వరలోనే ఒక స్టార్ హీరో సరసన మూవీతో మళ్ళీ ఆడియన్స్ కి హాయ్ చెప్పబోతుందని అనుకుంటున్నారు.

దళపతి విజయ్ – వెంకట్ ప్రభు కాంబోలో.. విజయ్ తన 68వ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా మీనాక్షిని ఫైనల్ చేశారని వార్త వైరల్ అవుతుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందని సమాచారం. అప్పుడే మీనాక్షిని కూడా ఆడియన్స్ కి పరిచయం చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఏజిఎస్ సినిమాస్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ సరసన హీరోయిన్ గా ఛాన్స్ అంటే పెద్ద ఆఫర్ కొట్టేసింది అని అంతా భావిస్తున్నారు.

ఇక ఈ అమ్మడు నటిస్తున్న ఈ చిత్రాలు అన్ని కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కాబోతున్నాయి. దీంతో నెక్స్ట్ ఇయర్ మీనాక్షి ఫ్యాన్స్ కి ఫుల్ పండగ అని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రీలీల తర్వాత అన్ని సినిమాలు చేస్తుంది మీనాక్షి అనే చెప్పుకోవాలి. మరి వీరిద్దరూ కలిసి నటిస్తున్న గుంటూరు కారం ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుందో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగక తప్పదు.

Exit mobile version