Site icon Prime9

Eagle Movie : మాస్ మహరాజ్ రవితేజ ‘ఈగల్’ మూవీ టీజర్ రిలీజ్.. నెక్స్ట్ విశ్వరూపమే అంటూ !

mass maharaj raviteja Eagle Movie teaser released

mass maharaj raviteja Eagle Movie teaser released

Eagle Movie : మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా  ‘ఈగల్’. తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మధుబాల, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘ధ‌మాకా’తో ర‌వితేజ‌కు సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ, ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే ఈగల్ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ మూవీతో రవితేజ మళ్ళీ హిట్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నారు. తాజాగా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ లుంగీ కట్టి, తుపాకీ పట్టి మరింత మాస్ గా కనిపించి ఫ్యాన్స్ తి విజిల్స్ వేయిస్తున్నారు.  “కొండలో లావాను కిందకు పిలవకు.. ఊరు ఉండదు.. నీ ఊనికి ఉండదు” అంటూ రవితేజ వాయిస్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. అడవిలో ఉంటాడు.. నీడై తిరుగుతుంటాడు.. కనిపించడు.. కానీ వ్యాపించి ఉంటాడు అంటూ అవసరాల శ్రీనివాస్ చెప్పడం.. ఆ తర్వాత “ఇది విధ్వంసం మాత్రమే.. తర్వాత చూడబోయేది విశ్వరూపమే” అంటూ నవదీప్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

రీసెంట్ గానే  వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంతో దసరా బరిలో నిలిచాడు. రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించిన ఆ మూవీలో రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. అభిషేక్ అగర్వాల్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీకి.. జీవి ప్ర‌కాశ్ సంగీతం అందించారు. అయితే ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఈ చిత్రం అలరించలేకపోయింది. పాన్ ఇండియా రేంజ్ లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వచ్చిన ఈ మూవీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయింది. మరి ఈ సినిమాతో రవితేజ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version